చాణ‌క్య‌నీతి: వీరితో ఉంటే సంతోషంలోనూ దుఃఖమే... జీవితమంతా నరకం!

ABN , First Publish Date - 2022-06-20T12:34:30+05:30 IST

ఆచార్య చాణక్యుడు అనేక జీవన విధానాలను

చాణ‌క్య‌నీతి: వీరితో ఉంటే సంతోషంలోనూ దుఃఖమే... జీవితమంతా నరకం!

ఆచార్య చాణక్యుడు అనేక జీవన విధానాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా  మ‌నిషి మంచి జీవితాన్ని గడపవచ్చు. కొన్నిసార్లు మనం తెలియక మన జీవితాన్ని దుఃఖంతో నింపే వారితో స‌హ‌వాసం చేస్తాం. ఫ‌లితంగా జీవితాన్ని నరకం చేసుకుంటాం. అటువంటి పరిస్థితిలో వారికి దూరంగా ఉండటం మంచిది. ఆచార్య చాణక్యుడి మాటలు చేదుగా అనిపించినా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. ఆచార్య చాణక్యుడు కొంతమందికి దూరంగా ఉండాల‌ని సూచించాడు. లేకపోతే వీరు సంతోషంగా ఉన్నవారి జీవితాన్ని దుఃఖంతో నింపేస్తార‌ని తెలిపాడు. అలాంటివారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

మూర్ఖుడైన శిష్యుడు

గురువు ఎంత సమర్ధుడైనా, అతని కీర్తి ఎంత గొప్ప‌దైనా, అతని శిష్యులలో ఒక్క‌ మూర్ఖుడున్నా ఆ గురువు జీవితం న‌ర‌క‌ప్రాయం కావ‌డానికి  ఎక్కువ సమయం పట్టదు. మూర్ఖుడైన శిష్యుడు గురువును అవమానపరచడమే కాకుండా, తన మూర్ఖత్వంతో గురువు జీవితంలో అనేక అడ్డంకులు తెస్తాడు.


అసంతృప్తితో కొట్టుమిట్టాడేవారు

అన్ని సమయాలలో అసంతోషంగా, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల మ‌ధ్య‌ నివసించేవారు  నిరాశ‌కు గుర‌వుతుంటారు. వారి జీవితం కూడా దుఃఖంతో గడిచిపోతుంది.

దుష్ట స్త్రీ

మంచి నడవడికతో పాటు విద్యావంతులైన స్త్రీ సహవాసం ఒక పురుషుని జీవితంలో విజయాన్ని, సంతోషాన్ని నింపుతుంది. అదే దుష్ట స్త్రీ  సాంగత్యం అవ‌త‌లి వ్య‌క్తిలో దుఃఖాన్ని నింపుతుంది. భార్య దుర్మార్గురాలైతే భ‌ర్త జీవితం న‌ర‌క‌ప్రాయం అవుతుంది. ప్రపంచంలోని అన్ని ర‌కాల సుఖాలు,  సంతోషాలు దూర‌మ‌వుతాయి.

Updated Date - 2022-06-20T12:34:30+05:30 IST