చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి.. ఇవి మీలో ఉన్నాయా?

ABN , First Publish Date - 2022-03-08T12:37:27+05:30 IST

ఆచార్య చాణక్య భారతదేశానికి చెందిన ఉత్తమ పండితులలో...

చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి.. ఇవి మీలో ఉన్నాయా?

ఆచార్య చాణక్య భారతదేశానికి చెందిన ఉత్తమ పండితులలో ఒకనిగా పేరొందారు. ఆయన నాటి కాలంలో తెలిపిన మంచి మాటలు నేటికీ ఆచరణ యుక్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆచార్య చాణక్య మనిషి ప్రవర్తన గురించి తెలిపారు. దీనిపైనే మనిషి విజయం ఆధారపడివుంటుందని పేర్కొన్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, కఠినంగా మాట్లాడకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. ఇటువంటి మాటలు ఇతరులను బాధిస్తాయన్నారు ఆచార్య చాణక్య. ఇవి మీ విజయానికి ఆటంకం కలిగిస్తాయని తెలిపారు. మానవులలోని అనేక దుర్గుణాల గురించి చాణక్య చెప్పారు. ఇటువంటి లోపాలు కలిగి ఉన్న వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరని, విజయం సాధించలేరని చాణక్య స్పష్టం చేశారు. 

అగ్నికి మించి బాధించే పరుషమైన మాటలు 

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మనిషి నోటి నుంచి వచ్చే కఠినమైన మాటలు ఇతరులను అగ్నికంటే అధికంగా బాధిస్తాయన్నారు. కటువుగా మాట్లాడటం అనేది ఎదుటి వ్యక్తిని బాధించడమే కాకుండా తాను చేస్తున్న పనిని కూడా చెడగొడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదని ఆచార్య చాణక్య తెలిపారు. 


గౌరవాన్నిపెంచే మధురమైన వాక్కు

ఎవరైనా సరే ఎప్పుడూ మధురంగా మాట్లాడాలని ఆచార్య చాణక్య తెలిపారు. చక్కగా మాట్లాడటం ద్వారా అందరి నుండి గౌరవం లభిస్తుంది. మధురంగా మాట్లాడినప్పుడు.. ఎంతటి మొండితనం ఉన్న వ్యక్తి అయినా కూడా కరిగిపోతాడు. ప్రతి ఒక్కరూ మధురంగా మాట్లాడటాన్ని అలవర్చుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు. మధురంగా ​​మాట్లాడటం అనేది జీవితంలో పురోగతికి బాటలు వేస్తుంది. అలాంటివారు అందరికీ ప్రియమైనవారిగా మారుతారు. వారి కోసం ఎదుటివారు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-03-08T12:37:27+05:30 IST