this week markets: ఈ వారం మార్కెట్లపై నిపుణుల అంచనాలివే.. కారణాలు కూడా చెప్పేశారు..

ABN , First Publish Date - 2022-09-18T22:21:16+05:30 IST

దేశీయ స్టాక్ మార్కెట్ల గత మూడు సెషన్ల భారీ నష్టాల కారణంగా అంతక్రితం వారంలో నమోదయ్యిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి.

this week markets: ఈ వారం మార్కెట్లపై నిపుణుల అంచనాలివే.. కారణాలు కూడా చెప్పేశారు..

దేశీయ స్టాక్ మార్కెట్ల గత మూడు సెషన్ల భారీ నష్టాల కారణంగా అంతక్రితం వారంలో నమోదయిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో మొత్తంగా ఇరు సూచీలు 1.5 శాతం వరకు నష్టపోయాయి. ద్రవ్యోల్బణం కట్టడికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Fedaral reserve) అంచనాల కంటే అధికంగా వడ్డీ రేట్లు(Interest rates) పెంచనుందనే అంచనాలు ఒకవైపు.. యూఎస్ డాలర్(US dollar) సూచీ గణనీయ వృద్ధి, బాండ్ల లాభాలు(bond yield), ఎఐఐ(ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) విక్రయాలకు మొగ్గుచూపడం వంటి అంశాలు మార్కెట్ల పతనాన్ని శాసించాయి. అత్యధికంగా టెక్ రంగం 7 శాతం వరకు క్షీణించగా.. ఆ తర్వాత ఆటో, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, రియల్టీ స్టాక్స్, బ్యాంక్స్, మెటల్స్ స్టాక్స్ కూడా నేలచూపులే చూశాయి. ఈ ప్రభావంతో గతవారం బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex) 950 పాయింట్లు పతనమై 58,841 వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 300 పాయింట్లు తగ్గి 17,531 పాయింట్లు వద్ద ముగిసింది.


అయితే క్రితంవారం మాదిరిగానే ఈ వారం(సెప్టెంబర్ 19తో మొదలు)లో కూడా మార్కెట్లు అనిశ్చితి గురయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడ్ భేటీ, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్ ఇందుకు దారితీయవచ్చునని ప్రస్తావిస్తున్నారు. మార్కెట్ నిపుణుల అంచనాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్న టాప్-10 అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..


1. ఫెడ్ భేటీ..

ఈ వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ట్రేడర్లు, బ్యాంకుల కళ్లన్నీ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ భేటీపైనే ఉన్నాయి. 2 రోజుల భేటీ నిర్ణయాలు సెప్టెంబర్ 21న వెల్లడికానున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశాలున్నాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు యూఎస్ ఫెడ్ వృద్ధిరేటు అంచనాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని అంచనాలున్నాయి.


2. యూఎస్ డాలర్, బాండ్ల లాభాలు..

యూఎస్ డాలర్ల సూచీ 110 బెంచ్‌మార్క్‌ను దాటింది. 2002 తర్వాత ఇదే అత్యధికంగా ఉంది. మరోవైపు యూఎస్ 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల లాభాలు 2011 తర్వాత ప్రస్తుతం అత్యధికంగా 3.5 శాతంగా ఉంది. యూఎస్ భేటీకి ముందు ఈ రెండు అంశాల్లో కదలికలు మార్కెట్లకు చాలా కీలకం కానుంది.


ఎఫ్ఐఐ ఫ్లో..

ఇన్‌స్టిట్యూషనల్ ఫ్లోలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్న ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా ఉంది. యూఎస్ డాలర్ పెరుగుదల నేపథ్యంలో గత మూడు సెషన్లలో ఎఫ్ఐఐలు పెద్దమొత్తంలో విక్రయాలకు పాల్పడ్డారు. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.


4. గ్లోబల్ ఎకనామిక్ డేటా వివరాలు.

ఈ వారం యూఎస్ ఫెడ్ భేటీతోపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు కూడా వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి.


5. ఆయిల్ ధరలు..

క్రూడ్ ఆయిల్ ధరలు ఈ నెలలో 100 డాలర్లకు దిగువనే ట్రేడ్ అవుతున్నాయి.  డిమాండ్ బలహీనంగా ఉండడంతోపాటు వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో బ్యారెల్ ధర 90 బ్యారెల్స్‌కు దిగువకు కూడా వచ్చింది. అయితే రానున్న వారంలో ఆయిల్ ధరలు ఎలాంటి ఉంటాయో వేచిచూడాల్సిందే.


మిగతా కారణాలివే..

6. ఎకనామిక్ డేటా పాయింట్స్.

7. టెక్నికల్ వ్యూ.

8. ఎఫ్ అండ్ వో సంకేతాలు.

9. ఇండియా విఐఎక్స్(volatility index)

10. కార్పొరేటు యాక్షన్: బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, మహారాష్ట్ర స్కూటర్స్, భారత్ బిజ్లీ, ఫైజర్, ఎంసీఎక్స్ ఇండియా వంటి స్టాక్స్ వచ్చేవారం ట్రేడింగ్ ఎక్స్-డివిడెండ్ ప్రకటించనున్నాయి. కాగా ఈక్లెర్క్స్ సర్వీసెస్, ఛాయిస్ ఇంటర్నేషనల్, ఆల్ఫాలాజిక టెక్కీస్, ఐఎఫ్ఎల్ ఎంటర్‌ప్రైజెస్‌తోపాటు మరికొన్నికంపెనీలు ఎక్స్‌బోనస్ ప్రకటించనున్నాయి.

Updated Date - 2022-09-18T22:21:16+05:30 IST