Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

ABN , First Publish Date - 2021-09-17T20:13:27+05:30 IST

గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అక్కడ చిన్నచిన్నవాటికి కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. విదేశాల నుంచి వెళ్లేవారు వాటి గురించి తెలియక అక్కడి అధికారులకు చిక్కడం.. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అయ్యే ఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటాయి. కనుక విదేశాల నుంచి గల్ఫ్ వెళ్లేవారు ముందుగానే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశాల్లో  చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అక్కడ చిన్నచిన్నవాటికి కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. విదేశాల నుంచి వెళ్లేవారు వాటి గురించి తెలియక అక్కడి అధికారులకు చిక్కడం.. కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అయ్యే ఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటాయి. కనుక విదేశాల నుంచి గల్ఫ్ వెళ్లేవారు ముందుగానే వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఆ దేశాలకు మనం తీసుకెళ్లే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక గల్ఫ్ దేశమైన కువైత్ వెళ్లే వారు పొరపాటున కూడా కొన్ని వస్తువులను తీసుకెళ్లకూడదు. ఒకవేళ వాటిని తీసుకెళ్తే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం విదేశీయులు కువైత్ తీసుకెళ్లకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం. 


ఇవి కూడా చదవండి..

American సెనేట్‌లో కీలక బిల్లు.. NRI పిల్లలకు భారీ మేలు!

గుడ్‌న్యూస్ చెప్పిన Kuwait.. ఆ రెండు రంగాల్లో జాబ్ చేస్తున్న వలసదారులకు..


మొట్టమొదట మద్యం. ఎట్టిపరిస్థితిలో ఆ దేశానికి మద్యం తీసుకెళ్లకూడదు. బీరు, వైన్స్‌తో పాటు ఆల్కహాల్ తయారీకి వినియోగించే స్పిరిట్స్, కిట్స్ వంటివి తీసుకెళ్తే సమస్యను కొనితెచ్చుకున్నట్టే. అలాగే పోర్క్(పంది మాంసం) ఉత్పత్తులపై కూడా పూర్తి నిషేధం ఉంటుంది. కనుక వాటిని తీసుకెళ్లకూడదు. వైర్‌లెస్ ట్రాన్స్‌మీటర్స్, వాకీ-టాకీ రేడియోలతో సహా కమ్యూనికేషన్ పరికరాలు తీసుకెళ్లడం నిషేధం. తుపాకీలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అలంకారానికి ఉపయోగించే ఆయుధాలను సైతం మరిచిపోయి కూడా తీసుకెళ్లకూడదు. 


మత్తు పదార్థాలు. ఏ రకమైన మత్తు పదార్థాలను కూడా కువైత్‌లో అనుమతి ఉండదు. మత్తు పదార్థాలను కలిగి ఉండడం, విక్రయించడం, రవాణా చేయడంపై ఆ దేశంలో కఠినమైన చట్టాలు ఉంటాయి. ఒకవేళ మత్తు పదార్థాలతో దొరికితే మరణశిక్ష ఉంటుంది. చికిత్సల కోసం వినియోగించే మత్తుమందులను వినియోగించాలన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ అనుమతితో తప్పనిసరి. అలాగే కువైట్ ప్రభుత్వం, ఇస్లాం మతాన్ని అభ్యంతరకరంగా భావించే రాజకీయ, మతపరమైన అంశాలు. అటువంటి వస్తువులన్నీ జప్తు చేయబడతాయి. ఇలాంటి సందర్భంలో సరుకుదారునిపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఐవరీ లేదా అంతరించిపోతున్న జాతుల నుండి తయారు చేయబడిన వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరమే. కనుక కువైత్ వెళ్లేవారు ఈ వస్తువుల జాబితాను ఒకసారి పరిశీలించడం బెటర్.   



Updated Date - 2021-09-17T20:13:27+05:30 IST