చాణక్య నీతి: ఈ పరిస్థితులు అత్యంత దుర్భరం... జీవితం అతలాకుతలం!

ABN , First Publish Date - 2022-05-31T11:53:11+05:30 IST

ఆచార్య చాణక్యునికి రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక శాస్త్రంలో...

చాణక్య నీతి: ఈ పరిస్థితులు అత్యంత దుర్భరం... జీవితం అతలాకుతలం!

ఆచార్య చాణక్యునికి రాజకీయాలు, దౌత్యం, ఆర్థిక శాస్త్రంలో విశేష అనుభవం ఉంది. ఆచార్య తన విధానాలలో విజయానికి అవసరమయ్యే అనేక కీలక విషయాలను వెల్లడించడమే కాకుండా, జీవితంలోని ప్రతి అంశం గురించి చర్చించారు. చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం కొన్ని విషయాలు మనిషిని అమితంగా బాధిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


భార్య విడిచిపెట్టడం, సొంతవారి చేత అవమానం పొందడం. రుణం, దుష్ట రాజుకు సేవ చేయడం, పేదరికం, బలహీనుల సాంగత్యం ఈ ఆరు అంశాలు అగ్ని లేకుండా మనిషి శరీరాన్ని కాల్చేస్తాయి. భార్య విడిచిపెట్టిన వ్యక్తి  ఎదుర్కొంటున్న బాధను ఆ వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడని చాణక్యుడు తెలిపాడు. అదేవిధంగా ఒక వ్యక్తిని అయినవారే అవమానించినప్పుడు అది చాలా బాధాకరం.  దుర్మార్గుడైన రాజుకు(యజమాని) సేవ చేయడం మరింత బాధాకరం అని ఆచార్య చాణక్య  తెలిపారు. 

Updated Date - 2022-05-31T11:53:11+05:30 IST