చాణక్యనీతి: స్త్రీలో ఈ 4 గుణాలు ఉంటే ఆ ఇల్లు స్వర్గమే!

ABN , First Publish Date - 2022-06-06T12:39:41+05:30 IST

ఆచార్య చాణక్య తన చాణక్యనీతిలో తెలిపిన వివరాల...

చాణక్యనీతి: స్త్రీలో ఈ 4 గుణాలు ఉంటే ఆ ఇల్లు స్వర్గమే!

ఆచార్య చాణక్య తన చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం ఈ నాలుగు గుణాలు కలిగిన మహిళ ఇంటిని చక్కగా తీర్చి దిద్దుతుంది. ఇంటిని స్వర్గతుల్యం చేస్తుంది. ఆ గుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ధైర్యం:

చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ధైర్య గుణం స్త్రీలకు ఆయుధం లాంటిది. ఈ గుణం కలిగిన స్త్రీ తన భర్తకు అదృష్టవంతురాలిగా మారుతుంది. ఇంటిలోని స్త్రీ ధైర్యంగా ఉంటే కష్టాలు త్వరగా తొలగిపోతాయి.


2. ధర్మం

ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడిచే స్త్రీకి ప్రతిచోటా గౌరవం దక్కుతుంది. ధర్మాన్ని ఆశ్రయించేవారు తప్పుడు పనులు చేయరు. అలాంటివారు కుటుంబ సభ్యులకు ఆదర్శంగా నిలుస్తారు.

3. ప్రశాంతత

ప్రశాంత చిత్తం, వినయ స్వభావం కలిగిన స్త్రీ అందరినీ మెప్పించగలుగుతుందని చాణక్య తెలిపారు. ఈ గుణం కలిగిన స్త్రీలకు కోపం చాలా తక్కువగా ఉంటుంది. వీరు తమ ప్రశాంత చిత్తంతో పనులన్నింటినీ చక్కబెడతారు.

4. మధుర భాషణ

చాణక్య నీతి ప్రకారం మధురంగా ​​మాట్లాడే స్త్రీ ఇంటిలోని అందరి ప్రేమను, గౌరవాన్నిపొందుతారు. ఇలాంటి స్వభావం కలిగిన స్త్రీలు గొడవలకు దిగకుండా ప్రేమతో వ్యవహరిస్తుంటారు. 


Updated Date - 2022-06-06T12:39:41+05:30 IST