నకిలీ పత్రాలు సృష్టించి స్థలం మాదంటున్నారు

ABN , First Publish Date - 2022-08-18T05:14:47+05:30 IST

నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరుతో ఉన్న స్థలాన్ని ఆక్రమించా రని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

నకిలీ పత్రాలు సృష్టించి స్థలం మాదంటున్నారు
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న బాధితులు, బీఎస్పీ నాయకులు


తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన 

కదిరిఅర్బన, ఆగస్టు 17: నకిలీ పత్రాలు సృష్టించి తమ పేరుతో ఉన్న స్థలాన్ని ఆక్రమించా రని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా బాధితులు మాట్లాడుతూ... వైసీపీ నాయకులు అధికార బలంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అవి చాలక పేదల ప్రజల స్థలాలపై కన్నేశారన్నారు. పట్టణానికి చెందిన మహమ్మద్‌అనీఫ్‌ కుమ్మరవాండ్లపల్లిలోని 758 సర్వేలో 3 సెంట్ల జాగాలో రెండు సెంట్లలో ఇల్లు కట్టుకున్నాడు. సెంటు స్థలాన్ని ఖాళీగా వదిలిపెట్టాడు. అయితే పట్టణానికి చెందిన అమ్మజాన అనే మహిళ దొంగపత్రాలు సృష్టించి ఆస్థలం తనదేనని ముందుకొచ్చిందన్నారు. ఈ స్థలం విషయంపై ఆమెకు, మహమ్మద్‌ అనీఫ్‌ కుటుంబ సభ్యుల మధ్య కోర్టులో కేసు నడుస్తోందన్నారు. వైసీపీ స్థానిక నాయకులు ఇటీవల ఆ స్థలంలో నిర్మాణం చేపట్టారన్నారు. విషయం తెలుసుకుని  అడ్డుకోబోతే ఈ స్థలం అమ్మజాన అనే మహళ నుంచి తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. దానికి సంబంఽధించిన పత్రాలు చూపమంటే, చూపకుండా ఈ స్థలం తమదని, మీకు దిక్కున్నచోట చెప్పుకోండని దాడి చేసినట్లు ఆవేదన చెందారు. ఈవిషయంపై స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి, స్థానిక పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు దీనిపై అఽధికారులు స్పందించలేదన్నారు. అనంతరం డిప్యూటీ తహసీ ల్దార్‌ సునీతకు వినతిప్రతం అందించారు. కార్యక్రమంలో బిఎస్‌పీ నాయకులు సుబ్బరాయుడు, షేక్‌ఇర్ఫాన, మురళీఽధర్‌గౌడ్‌, కల్యాణి, సుజాతమ్మ, బెనర్జీ బాధితులు ఇమ్రాన తదితరులున్నారు. 


Updated Date - 2022-08-18T05:14:47+05:30 IST