Pawan Kalyan: రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు: పవన్ కల్యాణ్‌

ABN , First Publish Date - 2022-08-23T01:33:25+05:30 IST

AP News: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా..కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశం నుంచి ఎంతో మంది

Pawan Kalyan: రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు: పవన్ కల్యాణ్‌

AP News: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరోక్షంగా సీఎం జగన్‌ (CM Jagan)ను టార్గెట్ చేశారు. రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా..కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశం నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. ‘పెట్టుబడులు పెట్టాలంటే వారికి కప్పం కట్టాలట.. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై చేసినట్లు దాడి చేస్తారట.పెట్టుబడులు రానిదే రాయలసీమ అభివృద్ధి జరగదు. సీమ వెనకబడిదంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. రాయలసీమ యువత ఉపాధి కోసం..బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. దివ్యాంగులకు చేతనైనంతా సాయం చేయాలని ఉంది. వారికి చేయూత ఎలా అందించాలన్న దానిపై ఆలోచిస్తున్నాం. విద్య, క్రీడారంగాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక విధానం ఉండాలి’’ అని పేర్కొన్నారు. రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. తమ సమస్యలకు మీరైనా పరిష్కారం చూపాలని బాధితులు పవన్ కు వినతులు అందజేస్తున్నారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పింది: పవన్‌

జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి అమలులో ఘోరంగా వైఫల్యం అయ్యారని పవన్ ఆరోపించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇంతవరకు లేదు. ఉద్యోగ కల్పన విషయంలో మాట తప్పారు. వాహనమిత్ర సాయం అందిస్తూనే..చలాన్ల రూపంలో దోచుకుంటున్నారు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ 

రాజధాని లేని రాష్ట్రం ఏదంటే.. ఏపీ అనే చెప్పుకునే పరిస్థితి రావడం మనందరికీ సిగ్గుచేటని పవన్ వ్యాఖ్యానించారు. ‘వైసీపీ వల్ల ఏపీకి హానికరం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ మా నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తాం. జనసేన పార్టీ నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటాం. సెప్టెంబర్ నుంచి కార్యాచరణ మొదలుపెడతాం. పార్టీ నేతలు సోషల్‌మీడియా, ఇంటర్వ్యూలకే పరిమితం కావొద్దు. ప్రభుత్వ వైఫల్యాలపై సీరియస్‌గా పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. 


నేతలను గుర్తించి ప్రోత్సహిస్తాం 

అధికారం‌ చూడని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల్లో నేతలను గుర్తించి ప్రోత్సహిస్తామని పవన్ పేర్కొన్నారు. పార్టీ కోసం శ్రమించే వాళ్లను గుర్తుంచుకుంటామన్నారు. ‘‘వక్ఫ్‌బోర్డ్‌ ఆస్తుల పరిరక్షణకు‌ జనసేన పోరాడుతుంది. భవిష్యత్‌లో తీర్చలేని స్థాయిలో ప్రభుత్వం అప్పులు చేసింది. వైసీపీకి అధికారం దూరం చేయడమే మా విధానం.’’ అని అన్నారు. 

Updated Date - 2022-08-23T01:33:25+05:30 IST