వారికి వ్యాక్సిన్‌ లేదు

ABN , First Publish Date - 2021-05-11T05:01:17+05:30 IST

హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు ఇచ్చినఅవకాశాన్ని వినియోగించుకోక పోవడం వల్ల వారికి ప్రస్తుతం వ్యాక్సిన్‌ వేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి వ్యాక్సిన్‌ వేయాలంటే జాయింట్‌ కలెక్టర్‌ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది.

వారికి వ్యాక్సిన్‌ లేదు


కొత్తవలస,  మే 10 : హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు ఇచ్చినఅవకాశాన్ని వినియోగించుకోక పోవడం వల్ల వారికి ప్రస్తుతం వ్యాక్సిన్‌ వేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి వ్యాక్సిన్‌ వేయాలంటే జాయింట్‌ కలెక్టర్‌ నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఈ సంవత్సరం జనవరి 17 నుంచే వీరికి వ్యాక్సిన్‌ వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఉపయోగించుకోలేదని పేర్కొంది. వ్యాక్సిన్‌ కోసం 18-45 సంవత్సరాలలోపు వారు ఆన్‌లైన్‌లో చేసుకున్న రిజిస్ర్టేషన్‌లు అన్నింటినీ రద్దు చేసినట్టు తెలిపింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం తీసుకుంది.  అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ ప్రకారం ఈ నెల 31 వరకు మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి మాత్రమే రెండో డోసు వేస్తారు.


Updated Date - 2021-05-11T05:01:17+05:30 IST