Viral Video: పోలీసుల ఎదురుగానే డెమో ఇచ్చిన దొంగ.. కొద్ది సెకెండ్లలో చకాచకా చోరీ ఎలా చేస్తారో చూడండి..

ABN , First Publish Date - 2022-03-17T08:31:31+05:30 IST

వాళ్లు రాయల్ దొంగలు.. ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను మాత్రమే దొంగిలిస్తుంటారు.. వాటిని అమ్మి జల్సాలు చేస్తుంటారు.. ఇటీవల వారు పోలీసులకు పట్టుబడ్డారు.. అంతేకాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను ఎలా దొంగతనం చేస్తాడో ఒక దొంగ...

Viral Video: పోలీసుల ఎదురుగానే డెమో ఇచ్చిన దొంగ.. కొద్ది సెకెండ్లలో చకాచకా చోరీ ఎలా చేస్తారో చూడండి..

వాళ్లు రాయల్ దొంగలు.. ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను మాత్రమే దొంగిలిస్తుంటారు.. వాటిని అమ్మి జల్సాలు చేస్తుంటారు.. ఇటీవల వారు పోలీసులకు పట్టుబడ్డారు.. అంతేకాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను ఎలా దొంగతనం చేస్తాడో ఒక దొంగ పోలీసుల ఎదురుగానే ఓ డెమో ఇచ్చాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని  గ్వాలియర్ డిడి నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బుల్లెట్ బైక్ దొంగలను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. శ్యామ్ గుర్జార్, బజ్నా గుర్జర్ అనే ఇద్దరు దొంగలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను దొంగిలించి వాటిని విక్రయిస్తుంటారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బుల్లెట్లను దొంగిలించారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వీరి వద్ద ఉన్న మూడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. 


పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఎదురుగా బుల్లెట్ బండి ఎలా దొంగతనం చేయాలో శ్యామ్ ఒక డెమో ఇచ్చాడు. సీటు మీద కూర్చుని హ్యాండిల్‌పై ఒక కాలు వేసి బలంగా నెట్టాడు. దాంతో తాళం పగిలిపోయింది. వెంటనే వైర్లను కత్తిరించి నేరుగా సెల్ఫ్ బటన్‌కు కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత సెల్ఫ్ బటన్ నొక్కగానే బుల్లెట్ స్టార్ట్ అయింది. ఈ పనులన్నీ చేయడానికి అతనికి కేవలం 20 సెకెండ్లు మాత్రమే పట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-03-17T08:31:31+05:30 IST