రాత్రి సమయంలో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లిన యువకుడు.. తొలుత దేవుడుకి నమస్కరించి.. ఆ తర్వాత అతడు చేసిన పటేంటో తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2021-11-14T02:51:18+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంత కూడా భయం లేకుండా ఇదేం పని అంటూ కంగుతింటున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి

రాత్రి సమయంలో హనుమాన్ టెంపుల్‌కు వెళ్లిన యువకుడు.. తొలుత దేవుడుకి నమస్కరించి.. ఆ తర్వాత అతడు చేసిన పటేంటో తెలిస్తే షాకవుతారు

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంత కూడా భయం లేకుండా ఇదేం పని అంటూ కంగుతింటున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మహారాష్ట్రలోని థానేకు చెందిన ఆ యువకుడికి సుమారు 20ఏళ్లలోపు వయసు ఉంటుంది. అతడు స్థానికంగా ఉన్న హనుమాన్ టెంపుల్‌కు రాత్రి సమయంలో వెళ్లి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది. గుడిలోకి వెళ్లిన ఆ కుర్రాడు.. తొలుత తన పాకెట్‌లో ఉన్న ఫోన్ తీసి, ఏదో చూస్తున్నట్టుగా నటిస్తూ చుట్టుపక్కల పరిశీలించాడు. దరిదాపుల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని.. ఫోన్‌ను మళ్లీ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా దేవుడి విగ్రహానికి వద్దకు చేరుకుని.. పదాలకు నమస్కరించాడు. అనంతరం అక్కడ ఉన్న హుండీని అమాంతం ఎత్తుకుని పరుగులు తీశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘భయం లేకుండా ఇదేం పని’ ఆ కుర్రాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఆలయ పూజారి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇదే తరహా దొంగతనం 2019లో హైదరాబాద్‌లో కూడా జరిగింది. గన్‌ఫౌండరి ప్రాంతంలోని దుర్గాభవాని ఆలోయంలోకి ప్రవేశించిన దుండగుడు తొలుత అమ్మవారికి నమస్కరించి.. ఆ తర్వాత కిరీటాన్ని దొంగతనం చేశాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అప్పట్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. 




Updated Date - 2021-11-14T02:51:18+05:30 IST