శివినిలో దొంగలు హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-04-15T05:32:59+05:30 IST

మండలంలోని శివిని గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

శివినిలో దొంగలు హల్‌చల్‌

మూడిళ్లలో చోరీ
కొమరాడ, ఏప్రిల్‌ 14:
మండలంలోని శివిని గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొరజాన సత్యంనాయుడు ఇంట్లో రూ. 80 వేలు నగదు,  పుల్లాపు శ్రీనివాసరావుకు చెందిన వెండి పట్టీలు, చెవిదిద్దులు, రూ.3 వేలు నగదు, ముంతల పైడితల్లి ఇంట్లో చెవి దిద్దులు, రూ. 4 వేలు నగదును దొంగలు అప హరించారన్నారు. గ్రామ సమీపంలో పార్వతీపురం, రాయగడ జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు డ్రైవర్‌పై దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచారు. ఆయన వద్ద నుంచి రూ. 3 వేలు నగదును తీసుకుపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని కొమరాడ ఎస్‌ఐ వి.జ్ఞానప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-04-15T05:32:59+05:30 IST