ATM robbery: ఏకంగా 35 లక్షల చోరీ.. దొంగతనం ఎలా జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-25T12:48:28+05:30 IST

దొంగలు ఏటీఎంల వద్ద డబ్బు దోచుకునేందుకు కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఇటీవల బీహార్‌లో ఎటిఎం నుంచి డబ్బు దొంగతనం చేసేందుకు దుండగులు...

ATM robbery: ఏకంగా 35 లక్షల చోరీ.. దొంగతనం ఎలా జరిగిందంటే..

ఇటీవల ఏటిఎం దొంగతనాల కేసుల బాగా పెరిగిపోయాయి. ఏటిఎం మెషిన్ నుంచి డబ్బు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు బ్యాంకులు చెబుతూనే ఉంటాయి. దొంగలు ఏటీఎంల వద్ద డబ్బు దోచుకునేందుకు కొత్త కొత్త పద్ధతుల అనుసరిస్తున్నారు. ఇటీవల బీహార్‌లో ఎటిఎం నుంచి డబ్బు దొంగతనం చేసేందుకు దుండగులు కూడా ఒక కొత్త పద్ధతిని అనుసరించారు. 


బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాలో ఏటిఎం దొంగలు గ్రామీణ ప్రాంతాలలో టార్గెట్ చేశారు. గత ఆదివారం రాత్రి నలుగురు దొంగలు రెండు చోట్ల ఏటిఎం నుంచి డబ్బు తీసేందుకు యత్నించారు. మొదటి ప్రయత్నంలో పోలీసులు గస్తీ కారణంగా పిఎన్‌బి ఏటిఎం నుంచి చోరీ చేయలేకపోయారు. రెండవ ప్రయత్నంలో ఎస్‌బీఐ ఏటిఎంను దోచుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా వారి పప్పులు ఉడకలేదు. దీంతో వారు ఒక కొత్త పద్థతితో తమ పని కానిచ్చారు.


ఆ నలుగురు దొంగలు స్కార్పియో కారులో వచ్చారు. రాగానే ముందుగా సీసీటీవి కెమెరాపై పెయింటు చల్లారు. దీంతో అక్కడి వీడియోలో వారిని గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఆ తరువాత ఏకంగా గంటన్నరపాటు ఏటిఎం నుంచి డబ్బులు తీయాలని ప్రయత్నించారు. చివరికి విసిగిపోయి ఏకంగా ఏటిఎం మెషిన్‌నే ఎత్తుకుపోయారు. 




దొంగతనం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవి వీడియోని పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులు మాట్లుడుతూ.. "దొంగలు దాదాపు గంటన్నర పాటు ఏటిఎం నుంచి డబ్బు దోచు కునేందుకు ప్రయత్నించి విఫలమైన తరువాత ఏటీఎం మెషిన్‌నే తీసుకొనిపోయారు. సీసీటీవి కెమెరాలో ఒక స్కార్పియో కారు కనిపించింది. దొంగల గుర్తింపు ఇంకా చేయల్సి ఉంది. ఏటిఎం మెషిన్‌లో ఎంత డబ్బు ఉన్నదో బ్యాంకు అధికారులు చెప్పాలి" అని అన్నారు.

బ్యాంకు అధికారి మాట్లాడుతూ.. "ఏటిఎంలో దాదాపు రూ.35,77,000 ఉన్నాయి. అందులో నుంచి కొంత ప్రజలు డ్రా చేశారు. కచ్చితంగా చెప్పాలంటే ఏటిఎం డేటాని పరిశీలించాల్సి ఉంది" అని తెలిపారు.


Updated Date - 2021-11-25T12:48:28+05:30 IST