ఏటీఎంను పెకిలించేందుకు బుల్డోజర్ వాడిన దొంగలు.. సోషల్ మీడియాలో..

ABN , First Publish Date - 2022-04-26T01:05:55+05:30 IST

ముంబై: డబ్బును కాజేసే విషయంలో దొంగలు దేనికైనా తెగిస్తారని రుజువుచేసే ఓ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని సంగ్లీలో

ఏటీఎంను పెకిలించేందుకు బుల్డోజర్ వాడిన దొంగలు.. సోషల్ మీడియాలో..

ముంబై: డబ్బును కాజేసే విషయంలో దొంగలు దేనికైనా తెగిస్తారని రుజువుచేసే ఓ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని సంగ్లీలో ఆదివారం ఓ దొంగల ముఠా ఏటీఎంను కొల్లగొట్టి రూ.27 లక్షలు దోచుకెళ్లింది. బూత్‌లోని ఏటీఎం మెషిన్‌ను పెకిలించేందుకు దొంగలు ఏకంగా బుల్డోజర్‌ను వాడారు. ఆదివారం నమోదయిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగల జాడను అన్వేషిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు. సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి బుల్డోజర్‌ను తీసుకొచ్చారని పోలీసులు గుర్తించారు.


 దొంగలు ఈ స్థాయిలో రెచ్చిపోవడంపై సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు నిరుద్యోగ సమస్యకు అద్దంపడుతోందని అంటున్నారు. ‘‘ ఇండియా గాట్ టాలెంట్’ అని ఓ ఫేస్‌బుక్‌ యూజర్ జోకు పేల్చాడు. క్రిప్టో మైనింగ్ జరుగుతున్న కాలంలో ‘ఏటీఎం మైనింగ్’ కొత్త ఆవిష్కరణ అని వ్యాఖ్యానించాడు. సమీప భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని మరో వ్యక్తి ట్విట్టర్‌లో జోస్యం చెప్పాడు. ‘డబ్బు దొంగతనం 2023?’ అంటూ వచ్చే ఏడాది ఇలాంటి దొంగతనాలు జరగవా అనే సందేహాలు వెలిబుచ్చాడు. నిరుద్యోగం, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్న ఉండడంతో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. 


కాగా గతవారం ఇదే తరహా మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని చండౌలీ జిల్లాలో ఓ దొంగ.. హార్డ్‌వేర్ స్టోర్‌లో దొంగతనం చేశాడు. పని పూర్తవ్వగానే డ్యాన్స్ చేశాడు. సీసీటీవీలో నమోదయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్పీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-04-26T01:05:55+05:30 IST