తీగలేరు-చిన్న కండ్లేరు అనుసంధానం

ABN , First Publish Date - 2022-08-18T06:28:58+05:30 IST

ఎట్టకేలకు పుల్లలచెరువు మండల ప్రజల కల నెరవేరబోతోంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని తీగలేరు, మండలంలోని చిన్నకండ్లేరు అనుసంధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తీగలేరు-చిన్న కండ్లేరు అనుసంధానం
చిన్న కండ్లేరు

జీవో విడుదల చేసిన ప్రభుత్వం

రూ.83.78 కోట్లు మంజూరు

1,500 ఎకరాలకు అందనున్న సాగునీరు

పుల్లలచెరువు, ఆగస్టు 17: ఎట్టకేలకు పుల్లలచెరువు మండల ప్రజల కల నెరవేరబోతోంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని తీగలేరు, మండలంలోని చిన్నకండ్లేరు అనుసంధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం అమరావతిలోని సచివాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ చిన్నకండ్లేరు అనుసంధానానికి పాలనా అనుమతులు ఇస్తూ జీవో నంబర్‌ 1824 విడుదల చేశారు. పనులు చేపట్టేందుకు రూ.83.78కోట్ల మంజూరుకు కూడా అనుమతులు ఇచ్చారు. ఈ అనుసంధానంతో 11,500 ఎకరాలకు సాగు, మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు అందనుంది. త్వరలోనే కొత్త ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత 10 ఏళ్లుగా తీగలేరు-చిన్నకండ్లేరు అనుసంధానం కోసం మండల రైతులు, రైతు సంఘాలు ఉద్యమం చేసిన విషయం తెలిసిందే.  

Updated Date - 2022-08-18T06:28:58+05:30 IST