Advertisement

సర్పంచ్‌కు తెలియకుండానే పనులు ప్రారంభం

Mar 6 2021 @ 00:46AM

 శ్రీనివాసాపురం ఎస్సీ మహిళా సర్పంచ్‌కు అవమానం, కలెక్టర్‌కు ఫిర్యాదు

హుజూర్‌నగర్‌, మార్చి 5:  మండలంలోని శ్రీనివాసాపురం ఎస్సీ మహిళా సర్పంచ్‌ పత్తిపాటి రమ్యనాగరాజుకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ శుక్రవా రం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌ఆర్జీఎస్‌ కాలువ పూడికతీత పనులకు సర్పంచ్‌కు తెలియకుండా కార్యదర్శి ఇందిరమ్మ ఇష్టారాజ్యంగా పనులు ప్రారంభించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఎస్సీ మహిళా సర్పంచ్‌ కావడంతోనే కార్యదర్శి తనని చిన్నచూపు చూస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

Follow Us on:
Advertisement