ఈనెల 15 తర్వాత పరిస్థితులు మారుతాయి: సిద్ధూ

ABN , First Publish Date - 2022-01-09T22:28:28+05:30 IST

పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తుందనే అంశంపై ..

ఈనెల 15 తర్వాత పరిస్థితులు మారుతాయి: సిద్ధూ

చండీగఢ్: పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తుందనే అంశంపై పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. జనవరి 15 తర్వాత పరిస్థితులు మారుతాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు ఈనెల 15 వరకూ చేపట్టరాదని ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు ఆదేశాలిచ్చినందున ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తాయని అనుకుంటున్నానని అన్నారు. అప్పటి వరకూ డిజిటల్ క్యాంపైన్ జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కూడా పరిస్థితులు మరింత విషమిస్తే ఈ కఠిన పరీక్షను ఎదుర్కోక తప్పదని వ్యాఖ్యానించారు.


పార్టీ అభ్యర్థుల జాబితా త్వరలోనే ఖరారు అవుతుందని సిద్ధూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇవాళ కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిందని, అన్నివిధాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా చివర్లోనే అభ్యర్థులను ప్రకటిస్తుందని సిద్ధూ అన్నారు.

Updated Date - 2022-01-09T22:28:28+05:30 IST