Mumbaiలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-30T13:25:43+05:30 IST

ఒమైక్రాన్ వేరియెంట్‌పై మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు....

Mumbaiలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభం

మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు

ముంబై: ఒమైక్రాన్ వేరియెంట్‌పై మహారాష్ట్ర కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు.ముంబై నగరంలో కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైందని డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు. ముంబై నగరంలో గత 24 గంటల్లో 2,500 కొవిడ్ కేసులు వెలుగుచూడగా, కరోనా మూడో వేవ్ ప్రారంభాన్ని చూపుతుందని డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు. ఒమైక్రాన్ వేరియంట్ కెరటంలా వ్యాప్తిచెందుతుందని, రోజుకు 10వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశముందని డాక్టర్ హేమంత్ థాకరే చెప్పారు. సాధారణ జలుబు లేదా ఫ్లూ లాగా ఒమైక్రాన్ ప్రబలుతుందని, దేశంలో మరో ఆరువారాల్లో ఒమైక్రాన్ పతనాన్ని చూడవచ్చని డాక్టర్ హేమంత్ చెప్పారు. ఒమైక్రాన్ వేరియెంట్ గురించి ప్రజలు భయపడవద్దని, వైద్యులను సంప్రదించాలని డాక్టర్ హేమంత్ సూచించారు.జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, అలసట, వెన్నునొప్పి, తలనొప్పి వంటివి ఒమైక్రాన్ లక్షణాలని డాక్టర్ హేమంత్ చెప్పారు.


Updated Date - 2021-12-30T13:25:43+05:30 IST