కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతం: 13 రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కేసులు!

ABN , First Publish Date - 2021-07-22T14:55:00+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ...

కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతం: 13 రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కేసులు!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, కరోనా కేసుల సంఖ్య కూడా అదే రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే కరోనా థర్డ్ వేవ్ వచ్చేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, అమెరికా, రష్యాలో కరోనా కేసులు లెక్కకుమించి పెరుగుతుండటం భారత్‌కు మరింత ఆందోళనకరంగా మారింది. 


కాగా భారత్ జనాభాలో 68 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఇదేసమయంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య తిరిగి 40 వేలకు చేరుతోంది. ఈ పరిస్థితులను విశ్లేషిస్తే దేశంలో త్వరలోనే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలంతా కరోనా గైడ్‌లైన్స్ తప్పక పాటించాలని, అప్పుడే కరోనా నాను కట్టడి చేయగలమని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-07-22T14:55:00+05:30 IST