థైరాయిడ్‌ టెస్ట్‌ - ఏ పరీక్ష ఎందుకు?

Nov 30 2021 @ 02:59AM

మహిళలకు వైద్యులు తరచుగా సూచించే పరీక్ష థైరాయిడ్‌ టెస్ట్‌. ఆ పరీక్ష ఎందుకో, ఎలాంటిదో, ఫలితాన్ని బట్టి ఏం తెలుస్తుందో తెలుసుకుందాం!ఎ్‌సహెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) టెస్ట్‌

 ఏం చేస్తుంది: మెదడులోని పిట్యుటరీ గ్రంథి తయారుచేసే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ను కొలుస్తుంది. 

 ఏం తెలుస్తుంది: మెదడు ఈ హార్మోన్‌ను థైరాయిడ్‌ గ్రంథికి ఎక్కువ పరిమాణాల్లో పంపిస్తూ ఉంటే, ఆ విషయం తెలుస్తుంది.

ఎంత ఉండాలి: సాధారణ స్థాయి 0.35 - 5.00 మిల్లీ ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌.

ఫ్రీ టి3


 ఏం చేస్తుంది: శరీరంలో అందుబాటులో ఉన్న చురుకైన థైరాయిడ్‌ పరిమాణాన్ని కొలుస్తుంది.

ఏం తెలుస్తుంది: ఈ హార్మోన్‌ స్థాయి తక్కువగా ఉంటే, మన శరీరం అచేతనంగా ఉన్న ఈ హార్మోన్‌ను చురుగ్గా మార్చలేక

పోతోందని అర్థం. 

 ఎంత ఉండాలి: సాధారణ స్థాయి 2.3 - 4.2 పికోగ్రామ్స్‌ పర్‌ 

మిల్లీలీటర్‌


ఫ్రీ  టి4

 ఏం చేస్తుంది: శరీరంలో అందుబాటులో ఉన్న అచేతన థైరాయిడ్‌ హార్మోన్‌ పరిమాణాన్ని కొలుస్తుంది. 

 ఏం తెలుస్తుంది: టి4 తక్కువగా ఉంటే, చురుగ్గా ఉన్న హార్మోన్‌ తక్కువగా ఉందని అర్థం.

 ఎంత ఉండాలి: 0.9 - 2.3 నానోగ్రామ్స్‌ పర్‌ డెసిలీటర్‌


రివర్స్‌ టి3

 ఏం చేస్తుంది: నిల్వ ఉండిపోయిన లేదా నిద్రావస్థలో ఉన్న చురుకైన థైరాయిడ్‌ హార్మోన్‌ను కొలుస్తుంది. 

 ఏం తెలుస్తుంది: ఈ హార్మోన్‌ పరిమాణం పెరుగుదల... ఒత్తిడి లేక శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుదలకు సూచన

 ఎంత ఉండాలి: 10 - 24 నానోగ్రామ్స్‌ పర్‌ డెసిలీటర్‌


థైరాయిడ్‌ యాంటీబాడీస్‌

 ఏం చేస్తుంది: వ్యాధినిరోధకశక్తి తయారుచేసే రెండు రకాల థైరాయిడ్‌ యాంటీబాడీల పరిమాణాలను కొలుస్తుంది.

 ఏం తెలుస్తుంది: ఈ రెండు రకాల యాంటీబాడీలలో ఏ ఒక్కటి పెరిగినా అది ఆటోఇమ్యూన్‌ థైరాయిడ్‌ డిసీజ్‌ను సూచిస్తుంది.

 ఎంత ఉండాలి: థైరాయిడ్‌ పెరాక్సిడేజ్‌ యాంటీబాడీలు 0 - 35 మిల్లీ ఇంటర్నేషన్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌ ఉండాలి. థైరోగ్లోబ్యులిన్‌ యాంటీబాడీలు 0 - 0.4 మిల్లీ ఇంటర్నేషన్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌ ఉండాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.