blast: బుర్కినా ఫాసోలో పేలుడు...35 మంది మృతి

ABN , First Publish Date - 2022-09-06T13:37:00+05:30 IST

బుర్కినా ఫాసో (Burkina Fasos)జిహాదీ ప్రభావిత ప్రాంతంలో జరిగిన పేలుడులో(IED blast) 35 మంది...

blast: బుర్కినా ఫాసోలో పేలుడు...35 మంది మృతి

ఔగాడౌగౌ: బుర్కినా ఫాసో (Burkina Fasos)జిహాదీ ప్రభావిత ప్రాంతంలో జరిగిన పేలుడులో(IED blast) 35 మంది పౌరులు మరణించారు.సామాగ్రిని తీసుకువెళుతున్న కాన్వాయ్‌పై పేలుడు సంభవించడంతో 35 మంది పౌరులు మరణించగా, మరో 37 మంది గాయపడ్డారని సహెల్ ప్రాంత గవర్నర్ తెలిపారు.బుర్కినా ఫాసోలో భద్రతా పరిస్థితి దిగజారింది. జిహాదిస్ట్ దాడులకు ప్రతిస్పందనను కోరుతూ ప్రతిపక్ష మద్దతుదారులు ఔగాడౌగౌలో ప్రదర్శన జరిపారు.అల్-ఖైదా లేదా డేష్ గ్రూపుతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న జిహాదీల నేతృత్వంలోని పోరాటం సాగుతోంది.గత సంవత్సరం నుంచి  బుర్కినా హింసాకాండకు కేంద్రంగా మారింది. 2021లో పొరుగున ఉన్న మాలి లేదా నైజర్‌లో కంటే ఎక్కువ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 2వేల మంది కంటే ఎక్కువ మంది మరణించారు. మరో 1.9 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వలస వెళ్లారు. 


Updated Date - 2022-09-06T13:37:00+05:30 IST