
తిరుమల: ఈనెల 13 నుంచి 22 వరకు సిఫారసు లేఖలపై దర్శనం కేటాయించమని, వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తిరుమలలో తీవ్ర వసతి సమస్య ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులకు నందకం, వకుళ అతిథి గృహాల్లో వసతి కల్పిస్తామని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పొందిన భక్తులకు తిరుపతిలోని టీటీడీ గెస్ట్ హౌస్లో వసతి కేటాయిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి