
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండి వెలుపల వరకు క్యూలైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పట్టనుంది. శనివారం తిరుమల శ్రీవారిని 94,411 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.