తిరుమల కొండపై నేడు అంజనాద్రి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

ABN , First Publish Date - 2022-02-16T16:09:17+05:30 IST

తిరుమల: కొండపై ఆకాశగంగలో అంజనాద్రి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది.

తిరుమల కొండపై నేడు అంజనాద్రి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

తిరుమల: కొండపై ఆకాశగంగలో అంజనాద్రి ఆలయానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. అన్ని ఏర్పాట్లతో భూమి పూజ నిర్వహించారు. అయితే భూమి పూజకు కోర్టు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల కొండ కాదని కర్నాటక రాష్ట్రం హంపిలోని కిస్కిందకు చెందిన గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కిస్కిందలేనే హనుమంతుడు జన్మించాడన్నది ఆయన వాదన. అయినా టీటీడీ ముందుకెళ్లింది.


పలువురు సాహితీ ఆద్యాత్మిక రంగాలకు చెందినవారు కూడా టీటీడీ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే టీటీడీ ఏకంగా తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం పేరిట ఆలయం నిర్మించేందుకు సిద్ధపడింది. కాగా హనుమంతుని జన్మస్థలంపై గత ఏడాది నుంచి  వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-02-16T16:09:17+05:30 IST