ఈ సైకిల్‌ పడిపోదు!

ABN , First Publish Date - 2021-06-26T08:52:00+05:30 IST

సైకిల్‌ తొక్కడం నేర్చుకునే సమయంలో పడిపోవడం సాధారణంగా జరిగేదే.

ఈ సైకిల్‌ పడిపోదు!

అవునా!

సైకిల్‌ తొక్కడం నేర్చుకునే సమయంలో పడిపోవడం సాధారణంగా జరిగేదే. కానీ ఈ సైకిల్‌పై నేర్చుకుంటే మాత్రం పడిపోరు. ఎందుకంటే ఇది సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌. ఆ విశేషాలు ఇవి...


చైనాకు చెందిన జు హు జున్‌ అనే ఇంజనీరు ఒకరోజు సైకిల్‌ తొక్కుతూ బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డాడు. స్వల్పగాయాలతో బయపడ్డాడు. అప్పటి నుంచి తన తీరిక సమయాన్ని సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ తయారు చేయడం కోసం వెచ్చించాడు. చివరకు అనుకున్నది సాధించాడు.


‘‘సైకిల్‌ తొక్కడం నాకు రాదు. రెండు సన్నటి చక్రాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ సైకిల్‌ తొక్కే వారిని చూస్తుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది’’ అంటాడీ యువ ఇంజనీరు. యాక్సిలరోమీటర్లు, గైరోస్కోపుల సహాయంతో ఈ సైకిల్‌ను రూపొందించాడు.


లిథియం బ్యాటరీ సహాయంతో నడిచే ఈ సైకిల్‌ హ్యాండిల్‌పై కొద్దిగా బరువు వేసినా బ్యాలెన్స్‌ను నియంత్రించుకుని పడిపోకుండా ఉంటుంది. జిబి డెప్త్‌ సెన్సింగ్‌ కెమెరా, లిడార్‌ సెన్సర్‌ సహాయంతో ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తిస్తుంది. తనకు తానుగా ప్రయాణదిశను మార్చుకుంటుంది. 

Updated Date - 2021-06-26T08:52:00+05:30 IST