Leonardo Del Vecchio.. అనాథ శరణాలయంలో మొదలైన అతని జీవితం ఏ స్థాయికి చేరిందంటే..

ABN , First Publish Date - 2022-05-25T16:35:09+05:30 IST

లియోనార్డో డెల్ వెచియో.. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ, రే-బాన్, ఓక్లీ వంటి ప్రపంచ ప్రఖ్యాత కళ్లద్దాల బ్రాండ్ల గురించి చాలా మందికి తెలుసు.

Leonardo Del Vecchio.. అనాథ శరణాలయంలో మొదలైన అతని జీవితం ఏ స్థాయికి చేరిందంటే..

లియోనార్డో డెల్ వెచియో.. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ, రే-బాన్, ఓక్లీ వంటి ప్రపంచ ప్రఖ్యాత కళ్లద్దాల బ్రాండ్ల గురించి చాలా మందికి తెలుసు. వాటి మాతృసంస్థ లక్జోటికా (EssilorLuxottica SA)ను స్థాపించి, ప్రపంచంలోనే ఉత్తమ బ్రాండ్లలో ఒకటిగా నిలిపిన ఘనత డెల్ వెచియోది. ఇటలీలోనే ధనవంతులలో ఒకరిగా ఉన్న వెచియో చిన్నప్పటి జీవితం అనాథ శరణాలయంలో గడిచింది. 

ఇది కూడా చదవండి..

ఈ బాలిక సంకల్పానికి హ్యాట్సాఫ్.. ఒంటికాలితో గెంతుకుంటూ రోజూ పాఠశాలకు.. టీచర్ అవ్వాలని కోరిక..!


వెచియో పుట్టడానికి ఐదు నెలల ముందే అతని తండ్రి ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో వెచియో తల్లి గ్రాజియా నలుగురు పిల్లలతో రోడ్డున పడింది. ఓ కర్మాగారంలో రోజు కూలీగా పని చేసే గ్రాజియాకు నలుగురు పిల్లలను పోషించడం చాలా కష్ట సాధ్యంగా మారింది. దీంతో వెచియోను అనాథ శరణాలయంలో చేర్చింది. 14 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే గడిపిన వెచియో ఆ తర్వాత బయటకు వచ్చాడు. జీవితంలో మళ్లీ ఆకలి బాధలు అనుభవించకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు. కళ్లద్దాలు, ఫ్రేమ్‌లు తయారు చేయడంలో అద్భుత నైపుణ్యం సంపాదించాడు. 


EssilorLuxottica SA సంస్థను స్థాపించి సన్ గ్లాసెస్, ఫ్రేమ్స్, ఇతర విలాస వస్తువులను తయారు చేసేవాడు. క్రమంగా ఆ వ్యాపారాన్ని విస్తరించి, పలు సంస్థలను తమ సంస్థలో విలీనం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సంపాదించాడు. గత ఆదివారం 87వ జన్మదినోత్సవం జరుపుకున్న వెచియో ఇప్పటికీ చురుగ్గానే పని చేస్తున్నాడు. ఈ సంస్థలో ప్రస్తుతం 77,734 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 8,000 ఔట్‌లెట్స్ ఉన్నాయి. 

Updated Date - 2022-05-25T16:35:09+05:30 IST