హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదో తెలుసా!

ABN , First Publish Date - 2022-03-19T00:11:56+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదో ఏడాది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో, 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ‘ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ను తాజాగా వెల్లడించారు.

హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదో తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదో ఏడాది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో, 146 దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ‘ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ను తాజాగా వెల్లడించారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు వంటి వాటిని పరిశీలించి, 0-10 పాయింట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు. తాజా నివేదిక ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందే రూపొందింది. ఈ జాబితాలో డెన్మార్క్ (2), ఐస్‌లాండ్ (3), స్విట్జర్లాండ్ (4), నెదర్లాండ్స్ (5) ర్యాంకులు సాధించాయి. ఆఫ్ఘనిస్తాన్ చివరి (146) స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో లెబనాన్ (145), జింబాబ్వే (144), రువాండా (143) ర్యాంకులు సాధించాయి. ఇదే నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులు దాదాపు పది లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని, చిన్నారులకు సాయం అందకుంటే వాళ్లంతా మరణించే అవకాశం ఉందని వెల్లడైంది. మరోవైపు ఈ జాబితాలో మన దేశం టాప్-20లో కూడా లేకపోవడం గమనార్హం.

Updated Date - 2022-03-19T00:11:56+05:30 IST