బరువు తగ్గేందుకు ఈ డైట్‌!

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

ముందురోజు రాత్రి ఒక లీటరు నీళ్లల్లో కీరాముక్కలు, ఎనిమిది నుంచి పది

బరువు తగ్గేందుకు ఈ డైట్‌!

ఉదయం డిటాక్స్‌ డ్రింక్‌:  ముందురోజు రాత్రి ఒక లీటరు నీళ్లల్లో కీరాముక్కలు, ఎనిమిది నుంచి పది పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా అల్లం వేసి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ డ్రింక్‌ శరీరంలోని మలినాలను పోగొడుతుంది. కొవ్వును కరిగిస్తుంది.


బ్రేక్‌ఫాస్ట్‌: కొత్తిమీర, పాలకూర, నిమ్మరసం, ఆపిల్‌ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి జ్యూసులా చేసుకుని తాగాలి. ఈ డ్రింకులో పొటాషియం పాళ్లు అధికంగా ఉంటాయి  కాబట్టి తరచూ ఆకలి వేయదు.


లంచ్‌కి ముందు: క్యారెట్‌ ముక్కలు, పుదీనా, కీరా, కొత్తిమీర ఒక గిన్నెలో వేసుకుని తినాలి.


లంచ్‌లో: ఒక పెద్ద బౌల్‌లో రకరకాల మొలకెత్తిన గింజలు వేసుకుని అందులో ఆలివ్‌ ఆయిల్‌, కొద్దిగా ఆపిల్‌ ముక్కలు, కాస్త వెనిగర్‌ వేసి బాగా కలిపి తినాలి. దీనితోపాటు ఉడికించిన బంగాళాదుంపలు, నిమ్మరసం, కాస్త మిరియాలు, కాస్త వెనిగర్‌ వేసి తినాలి.


సాయంత్రం: నానబెట్టిన నాలుగు బాదం గింజలు, గుమ్మడి గింజలు తినాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు.


Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST