ఈ పెళ్లికి అనుమతించం

ABN , First Publish Date - 2021-08-03T06:53:41+05:30 IST

కేరళలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న క్రైస్తవ మాజీ

ఈ పెళ్లికి అనుమతించం

రేప్‌ బాధితురాలితో క్రైస్తవ మాజీ మతాచార్యుడి పెళ్లికి సుప్రీం నో


న్యూఢిల్లీ, ఆగస్టు 2: కేరళలో బాలికపై అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న క్రైస్తవ మాజీ మతాచార్యుడు, బాధితురాలు వేసిన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ద్విసభ్య ధర్మాసనం సోమవారం పేర్కొంది. కావాలనుకుంటే బాధితురాలు ట్రయల్‌ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. కేరళలోని కొట్టియూర్‌ అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనపై అత్యాచారం చేసిన మాజీ క్రైస్తవ మతాచార్యుడు రాబిన్‌ వదక్కుమ్‌చెర్రిని పెళ్ళాడేందుకు  అనుమతించాల్సిందిగా బాధితురాలు వ్యాజ్యం వేసింది.


ఇదే కేసులో బాధితురాలిని పెళ్ళి చేసుకొనేందుకు తనకు బెయిలు ఇవ్వాల్సిందిగా రాబిన్‌ విడిగా వేసిన వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్‌. అనంతరం ఆమె ఒక ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో పోప్‌ ఫ్రాన్సిస్‌... రాబిన్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. పోక్సో చట్టం కింద విచారణ జరిపిన థలసెరిలోని ప్రత్యేక కోర్టు నిందితుడికి 20 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నిరుడు తీర్పు ఇచ్చింది.  


Updated Date - 2021-08-03T06:53:41+05:30 IST