వైరల్ వీడియో: కుక్క తెలివికి నెటిజెన్లు ఫిదా

ABN , First Publish Date - 2020-09-07T00:33:27+05:30 IST

వైరల్ వీడియో: కుక్క తెలివికి నెటిజెన్లు ఫిదా

వైరల్ వీడియో: కుక్క తెలివికి నెటిజెన్లు ఫిదా

కాస్త ఆలోచన ఉంటే సవాళ్లకు పరిష్కారం మన ముందే కనిపిస్తాయని అంటుంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అని ఒప్పుకోక తప్పదు కావచ్చు. తమను బంధించిన వలయాన్ని దాటి తప్పించుకుంటున్న కుక్కలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆ మూగ జీవుల ఆలోచనకు తెగింపుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోందిం.


వీడియో ప్రకారం.. ఓ చిన్నారి కుక్క కేజ్‌ను ఎక్కే మార్గం కనుగొంది. తన చిన్ని కాళ్లతో కేజ్ మధ్యలో కాళ్లు పెడుతూ పెకి ఎక్కుతూ వెళ్లింది. ఇది గమనించి మరో కుక్క గబగబా కేజ్ ఎక్కి.. బయటకు దూకి పారిపోయింది. వాటితో పాటు మరిన్ని కుక్కలు కేజ్ ఎక్కేందుకు ప్రయత్నించాయి. 18 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో విలువైన సందేశం ఉందని నెటిజెన్లు అంటున్నారు. మూగజీవాలే అయినా కష్టాల నుంచి స్వప్రయత్నంతో బయట పడాలని మనకు నేర్పిస్తున్నాయని కామెంట్ల వర్షం కురుస్తోంది.



Updated Date - 2020-09-07T00:33:27+05:30 IST