తల్లులకు ఇద్దాం ఓ బహుమతి!

ABN , First Publish Date - 2020-12-23T05:30:00+05:30 IST

ఈ మధ్యే తల్లి అయిన వారిని చూసేందుకు వెళ్లినప్పుడు వారికి, పసిపాపకు అవసరమయ్యే వస్తువులను బహుమతిగా తీసుకెళితే బాగుంటుంది. తల్లులకు శ్రమ తగ్గించేలా, పిల్లలను ఆడించేలా ఉండే ఏ వస్తువులను కానుకగా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందో చూద్దాం...

తల్లులకు ఇద్దాం ఓ బహుమతి!

ఈ మధ్యే తల్లి అయిన వారిని చూసేందుకు వెళ్లినప్పుడు వారికి, పసిపాపకు అవసరమయ్యే వస్తువులను బహుమతిగా తీసుకెళితే బాగుంటుంది. తల్లులకు శ్రమ తగ్గించేలా, పిల్లలను ఆడించేలా ఉండే ఏ వస్తువులను కానుకగా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందో చూద్దాం...


బేబీ బౌన్సర్‌: చంటి పాపను అస్తమానం ఎత్తుకొని ఇంటి పనులు చూసుకోవడం తల్లులకు కష్టంగా ఉంటుంది. అదే బేబీ బౌన్సర్‌ ఉందనుకోండి అందులో పిల్లలను ఉంచితే వాళ్లు ఎంచక్కా ఆడుకుంటూ నిద్రలోకి జారిపోతారు కూడా. దాంతో తల్లులకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. 


బేబీ హ్యాండ్‌ ప్రింట్‌, ఫుట్‌ప్రింట్‌ కిట్‌: పిల్లల ప్రతి కదలికను ఒక మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. వారికి బేబీ హ్యాండ్‌ ప్రింట్‌, ఫుట్‌ ప్రింట్‌ కిట్‌ కానుకగా ఇస్తే పిల్లల చేతి, కాలి ముద్రలను ఫొటోఫ్రేమ్‌గా మలిచి, దానిని అపురూపంగా చూసకుంటారు.

 

నిబ్లర్‌ ఫసిఫైయర్‌: పిల్లలు నిబ్లర్‌ ఫసిఫైయర్‌తో ఆడుకుంటారు. అందులో పండ్లు లేదా ఆహారం వేసి వారికి అందిస్తే, పిల్లలకు పోషకాలు అందుతాయి. కొత్త రుచులను ఆస్వాదిస్తూ గడిపేస్తారు.


బేబీ స్లింగ్‌: చంటి పిల్లలను బయటకు తీసుకెళ్లేందుకు స్ట్రాలర్‌ వాడతాం. అయితే అందులో కొందరు పిల్లలు సౌకర్యంగా కూర్చోలేరు. వారిని బేబీ స్లింగ్‌లో కూర్చోబెడితే ఏ సమస్యా ఉండదు. ఇది సురక్షితమైనది కూడా. బేబీ స్లింగ్‌ ధరించినప్పుడు తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి పడదు. 

Updated Date - 2020-12-23T05:30:00+05:30 IST