Advertisement

సర్టిఫికెట్లు పోతే ఇలా పొందొచ్చు

Oct 27 2020 @ 04:38AM

సైదాబాద్‌, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లో వరద నీరు చేరింది. సర్టిఫికెట్లు తడిసిపోవడం, కొట్టుకుపోవడంతో వాటిని ఎలా తిరిగి పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇలా చేయడం వల్ల సర్టిఫికెట్లును పొందవచ్చు. 


పూర్తి వివరాలతో మీ పరిధిలోని పోలీ్‌సస్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నట్లు ఒక ధ్రువపత్రం ఇస్తారు. దాన్ని భద్రపర్చుకోవాలి. ఆ పత్రంతోపాటు రూ. 50ల స్టాంపు పేపర్‌పై నోటరీ లేదా అఫిడవిడ్‌ జతచేసి చదివిన స్కూల్‌ లేదా కళాశాలలో ప్రిన్సిపాల్స్‌కు దరఖాస్తు చేయాలి. వారు రికార్డులను పరిశీలించి ఆ వివరాలతో మీ ఫొటో జతచేసి ఒక ఫారం పూర్తి చేసి బోర్డు లేదా విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. పదో తరగతి సర్టిఫికెట్‌ పోతే.. ది సెక్రటరీ, కమిషనరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌, హైదరాబాద్‌ పేరిట రూ. 250 చలానా దరఖాస్తు జతచేయాలి. ఇంటర్‌ సర్టిఫికెట్‌ కోసం ది సెక్రటరీ, బోర్డ్డు ఆఫ్‌ ఇంటర్మీడియల్‌ ఎడ్యుకేషన్‌, హైదరాబా ద్‌ చలానా తీసి దరఖాస్తుతో జతచేయాలి. డిగ్రీ లేదా పీజీ సర్టిఫికెట్ల కోసం వైస్‌ చాన్సలర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ సర్టిఫికెట్లు చిరిగిపోయి, పాడైపోతే కొత్తవాటి కోసం దరఖాస్తు చేసేవారు పోలీస్‌ ఎంక్వైరీ సర్టిఫికెట్‌ లేదా అఫిడవిట్‌ లేకుండానే మీ దగ్గరున్న సర్టిఫికెట్ల ఆధారంగా చూపితే సరిపోతుంది. ఐసీఎ్‌సఈ, సీబీఎ్‌స ఈ లాంటి సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డులకైతే ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల కోసం దరఖఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. 


బ్యాంకు పాస్‌ పుస్తకాలు..

ఖాతాదారుడు బ్యాంక్‌ పాస్‌బుక్‌ పోగొట్టుకుంటే గుర్తింపు కార్డుల ఆధారంగా అకౌంట్‌ తనదేనని నిరూపించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్‌కు రిక్వెస్ట్‌ లెటర్‌ పెట్టా లి. ఖాతాదారుడికి కొత్త పాస్‌బుక్‌ ఇస్తూ నిర్ణీత రుసం వసూలు చేస్తారు. 


పాన్‌కార్డు..

ఆన్‌లైన్‌ డూప్లికెట్‌ పాన్‌కార్డు అని టైప్‌ చేసి అందులో రీప్రింట్‌ పాన్‌కార్డ్డు అని టైప్‌ చేసి ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం సంబంధిత వివరాలు నిం పాలి. ఆ తర్వాత దాని ప్రింట్‌ తీసుకుని దానికి పాతకార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫొటోలు, నివాస గుర్తింపు పత్రాలు, ఆదాయ సర్టిఫికెట్‌తోపాటు కొత్త పాన్‌కార్డు కోసం రూ. 90 డీడీ జత చేసి సంబంధిత కార్యాలయానికి పంపితే వారం రోజుల్లో పాన్‌కార్డు మీ ఇంటికి పోస్టు ద్వారా వస్తుంది.  


ఆధార్‌ కార్డు..

ఆధార్‌ కార్డు పోగొట్టుకుంటే ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకున్న ఎన్‌రోల్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయగానే మన ఆధార్‌ వస్తుంది. దీన్ని మరింత సులభతరం చేసింది ఆధార్‌ సంస్థ. మన మొబైల్‌ నంబర్‌ లేకపోయినా ఆధార్‌ నంబర్‌ను బట్టి తీసుకోవచ్చు. 


ఆస్తుల డూప్లికేట్‌ పత్రాలు

మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోగొట్టుకుంటే సమీప పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ పైల్‌ చేశాక ఒక ఆంగ్ల దినపత్రిక, ప్రాంతీయ భాషా పత్రికలో ఈ విషయంపై ప్రకటన ఇవ్వాలి. ప్రకటన వచ్చాక 15 రోజుల వరకు వేచి చూడండి. ఈలోపు ఆ పత్రాలు దొరికితే ఎవరైనా వాటిని తిరిగి అప్పగిస్తారేమో చూడండి. లేకపోతే మీ వద్ద ఉన్న ఎఫ్‌ఐఆర్‌, పేపర్లో ఇచ్చిన ప్రకటన, దానికి సంబంధించిన వివరాలు జతచేసి ఆ ఆస్తి ఏ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ పరిధిలో ఉంటే అక్కడ దరఖాస్తు చేయాలి. నిర్ణీత ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రార్‌ ఆఫీసు మీకు డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. 

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.