రూ.15.75 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-02-28T09:08:01+05:30 IST

అమెరికా రుణ భారం అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆ దేశ చట్టసభ సభ్యుడు అలెక్స్‌ మూనీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మొత్తం రుణాలు 29 లక్షల కోట్ల డాలర్లకు

రూ.15.75 లక్షల కోట్లు

భారత్‌కు అమెరికా చెల్లించాల్సిన అప్పు ఇది..

రూ.2,117 లక్షల కోట్లకు యూఎస్‌ మొత్తం రుణ భారం  


వాషింగ్టన్‌: అమెరికా రుణ భారం అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆ దేశ చట్టసభ సభ్యుడు అలెక్స్‌ మూనీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మొత్తం రుణాలు 29 లక్షల కోట్ల డాలర్లకు (రూ.2,117 లక్షల కోట్లు) చేరువవుతున్నాయన్నారు. అందులో చైనా, జపాన్‌కు చెరో లక్ష కోట్ల డాలర్లు (రూ.73 లక్షల కోట్ల పైమాటే) చెల్లించాల్సి ఉందని, భారత్‌కు  21,600 కోట్ల డాలర్లు (రూ.15.75 లక్షల కోట్లకు పైగా) బాకీ పడ్డామని ప్రతినిధుల సభలో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రిపబ్లికన్‌ సెనేటర్‌  వెస్ట్‌ వర్జీనియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా ఊరటగా జో బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించిన 1.9 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ఆయన వ్యతిరేకించారు. కాగా ఈ ఉద్దీపన ప్యాకేజీకి  సభ ఆమోదం లభించింది.

Updated Date - 2021-02-28T09:08:01+05:30 IST