అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

ABN , First Publish Date - 2022-06-29T21:08:41+05:30 IST

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐహెచ్‌సీఎం), కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఎంబీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐహెచ్‌సీఎం), కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(కిమ్స్‌), దార్‌-ఉస్-సలామ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం సంయుక్తంగా నిర్వహించే ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌)లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. అర్హత పరీక్ష-2022కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జూలై 26గా పేర్కొన్నారు.  www. braouonline. in ద్వారా మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి రసీదు పొందాలన్నారు. పూర్తి వివరాలకు 040-23680441/241/246, ఏఐహెచ్‌సీఎం 040-23556850/ 23543269, కిమ్స్‌-9949362459, డీఈటీ 040- 24802632/9704009232 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-06-29T21:08:41+05:30 IST