మహిళలు ఆటో నడుపుతున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? వీళ్ల నిర్ణయం వెనుక..

ABN , First Publish Date - 2022-03-09T23:19:07+05:30 IST

ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో విసిగిపోయిన కొందరు.. ఇక తమ వల్ల కాదంటూ ప్రయత్నాలు విరమించడం, కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ మరికొందరు..

మహిళలు ఆటో నడుపుతున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? వీళ్ల నిర్ణయం వెనుక..

ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో విసిగిపోయిన కొందరు..  ఇక తమ వల్ల కాదంటూ ప్రయత్నాలు విరమించడం, కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవలీలగా ఎదుర్కొని, అనుకున్నది సాధించి.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన కొందరు మహిళలు ఈ కోవకే చెందుతారు. భర్త దూరమై.. చివరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఆర్థిక సమస్యలతో పాటూ పిల్లల పోషణ కష్టతరమైంది. అయినా కుంగిపోకుండా ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కాలని కంకణం కట్టుకున్నారు. చివరకు అనుకున్నది సాధించి చూపించారు. వివరాల్లోకి వెళితే..


పిల్లల పోషణ కోసం..

రాజస్థాన్ కోటా పరిధి విజ్ఞాన్ నగర్‌లో నివాసం ఉంటున్న రేఖా బరౌలీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. మరోవైపు పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చదివించాలనేది ఆమె కల. అయితే అందుకు తగ్గ ఆదాయం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో హాస్టల్‌లో పనికి కుదిరింది. జీతం రూ.6వేలు మాత్రమే వస్తుండడంతో కుటుంబం గడవడమే కష్టమయ్యేది. దీంతో పిల్లలకు మంచి చదువు చెప్పించాలనే కల.. కలగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఆమెకు కోటా ఆటో యూనియన్‌తో పరిచయం ఏర్పడింది. ఇంటర్ వరకు చదువుకున్న రేఖా.. ఆటో నడపడం నేర్చుకుంది. ఎట్టకేలకు అందులో పూర్తి పట్టు సాధించింది. 2017 నుంచి ఆటో నడపడం ప్రారంభించింది. రోజుకు పది గంటలకు పైగా కష్టపడుతూ.. రోజుకు రూ.500పైగా సంపాదించడం మొదలెట్టింది. చివరకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించింది.

ఆ ఊర్లో ఆడవారిదే పెద్దరికం.. అన్ని ఇళ్లూ వారివే.. ఇంతకీ ఆ ఊరెక్కడుందో తెలుసా..


అప్పు చేసి సొంత ఆటో కొని.. 

ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న నజ్మా కథ కూడ ఇలాంటిదే. ఇంటర్ చదివిన నజ్మా.. భర్తతో గొడవపడి ఒంటరిగా ఉంటోంది. పిల్లల పోషణార్థం కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేది. అయితే ఆదాయం అంతంతమాత్రమే కావడంతో పూట గడవడం కష్టమయ్యేది. అనంతర కాలంలో నజ్మా కూడా కోటా ఆటో యూనియన్‌లో చేరింది. తర్వాత అప్పు చేసి సొంత ఆటో కొనుక్కుంది. ప్రస్తుతం ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా జీవిస్తోంది. రోజుకు రూ.5నుంచి రూ.6వందలు సంపాదిస్తోంది. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవని గర్వంగా చెబుతోంది.

నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి.. చివరకు..


తండ్రి వైద్యం కోసం.. 

లుంగీ ఫేరే రాయ్‌పూర్‌కు చెందిన రాణి కన్వర్.. ఎనిమిదవ తరగతి వరకూ చదువుకుంది. తండ్రికి కేన్సర్ సోకడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురు సోదరీమణులు ఉండగా.. ఇద్దరికి వివాహమైంది. తండ్రికి చికిత్స చేయించడంతో పాటూ కుటుంబ పోషణ బాధ్యత కూడా మీద పడింది. పెద్దగా చదువుకోకపోవడంతో ఉద్యోగం దొరకడం కష్టతరమైంది. ఈ క్రమంలో ఆటో నడుపుతున్న మహిళల గురించి తెలుసుకుని డ్రైవింగ్ నేర్చుకుంది. రెండేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు.. ప్రస్తుతం తల్లిని బాగా చూసుకుంటూ మరోవైపు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆటో నడపడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కానని చెబుతోంది.

‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..


రోజుకు 12గంటలు కష్టపడుతూ..

విజ్ఞాన్ నగర్ నివాసి ఆర్తి కూడా పెద్దగా చదువుకోలేదు. ఆరేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు పిల్లల పోషణ భారమైంది. ఈ క్రమంలో ఇళ్లలో వివిధ పనులు చేయడం, కూరగాయలు విక్రయించడం తదితర పనులు చేయడం మొదలెట్టింది. అయితే వచ్చే ఆదాయం ఇంటి అద్దె, పిల్లల పోషణకు కూడా సరిపోయేది కాదు. దీంతో సన్నిహితుల ద్వారా ఆటో డ్రైవింగ్ నేర్చుకుని.. ప్రస్తుతం సొంత కాళ్ల మీద జీవిస్తోంది. రాయ్‌పూర్‌కు చెందిన బీనా కథ కూడా ఇలాంటిదే. పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. కూతురికి పెళ్లి చేసి, ప్రస్తుతం తల్లితో పాటూ కలిసి ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం బీనా కూడా రోజుకు 12గంటల పాటు ఆటో నడుపుతోంది.

టాటూ వేయించుకునేందుకు వెళ్లిన యువతి.. బయటికొచ్చి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకుంది..


నజ్మా, బీనా, రేఖ, రాణి లాగానే మొత్తం 18మంది మహిళలు ఆటో నడపడం ద్వారా కష్టాల నుంచి గట్టెక్కారు. ఆటో నడిపే క్రమంలో కొన్నిసార్లు తాగుబోతులు, నేరస్థుల నుంచి ఇబ్బందులు తలెత్తేవి. దీంతో ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు వీరంతా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. మొదట్లో అప్పుడప్పుడూ ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఒకవేళ ఉన్నా ఎదిరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించి చివరికి తాము అబలలు కాము.. సబలలు అని నిరూపించుకున్న ఈ మహిళలు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పెద్దోళ్ల పెళ్లిలో సరదాగా గడిపారు.. పొద్దున చూస్తే ఆస్పత్రిలో ఉన్నారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..



Updated Date - 2022-03-09T23:19:07+05:30 IST