బాబా ఆశ్రమంలో యువతికి రోజుల తరబడి శాంతి పూజలు.. చివరకు ఓ రోజు బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా..

ABN , First Publish Date - 2022-02-18T00:52:47+05:30 IST

అమాయకుల బలహీనతను కొందరు దొంగ బాబాలు అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో పూజల పేరుతో లక్షలకు లక్షలు డబ్బులు రాబట్టడం.. మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడడం వంటి చట్ట వ్యతిరేకమైన..

బాబా ఆశ్రమంలో యువతికి రోజుల తరబడి శాంతి పూజలు.. చివరకు ఓ రోజు బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా..
ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొందరు మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు. పూజల పేరుతో చివరకు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఇటీవల చాలా చూశాం. కొందరు ఉన్నత విద్యావంతులు కూడా మూఢనమ్మకాల పేరుతో చివరకు జీవితాలను నాశనం చేసుకోవడం అందరికీ తెలిసిందే. అమాయకుల బలహీనతను కొందరు దొంగ బాబాలు అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో పూజల పేరుతో లక్షలకు లక్షలు డబ్బులు రాబట్టడం.. మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడడం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. తాజాగా చెన్నైలో ఓ దొంగ బాబా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. ఈమె చాలా కాలంగా కడుపు, మెడ నొప్పి తదితర సమస్యలతో బాధపడుతోంది. కొన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఉపశమనం కలగలేదు. మూఢనమ్మాలకు ఆకర్షితులైన ఆమె కుటుంబ సభ్యులు.. కొందరి సలహాతో యువతిని తిరువళ్లూరులోని మును స్వామి అనే బాబా ఆశ్రమానికి తీసుకెళ్లారు. హేమమాలినిని పరీక్షించిన బాబా.. ఆమెకు కొన్ని శాంతి పూజలు చేయాలంటూ నమ్మించాడు. ఇందుకోసం కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉంచాలనడంతో కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు.

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..


పూజల పేరుతో యువతిని రోజుల తరబడి ఆశ్రమంలోనే ఉంచుకుని, ఏవేవో మూలికలతో వైద్యం కూడా చేసేవాడు. అయితే రోజురోజుకూ ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందే గానీ మెరుగుపడలేదు. ఈ క్రమంలో మంగళవారం యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో యువతి అత్త ఇంద్రాణి ఆశ్రమానికి వచ్చింది. హేమమాలినిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అడగ్గా.. మొదట అంగీకరించని దొంగ బాబా, తర్వాత బలవంతం మీద ఒప్పుకొన్నాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ‘‘దొంగ బాబా మాటలు నమ్మి బంగారం లాంటి కూతురిని పొట్టనపెట్టుకున్నామే’’.. అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోస్టుమార్టం రిపోర్టులో పురుగుల మందు తాగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దొంగ బాబాపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దొంగ అందరిలా కాదు.. ఆరు రోజుల్లో లక్షల రూపాయల విలువైన చోరీ.. చివరికి ఏమైందంటే..

Updated Date - 2022-02-18T00:52:47+05:30 IST