ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ గుడ్డిదంటారు పెద్దలు. ఎవరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురిస్తుందో చెప్పలేని పరిస్థితి. కొందరైతే వయసూ, వరసలు కూడా మర్చిపోయి.. ప్రేమాయణం సాగిస్తుంటారు. సమాజంతో తమకేమీ పని లేదు అన్నట్లుగా కొందరి ప్రవర్తన ఉంటుంది. కొన్ని ప్రేమ వ్యవహారాలు చివరకు చాలా పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. అయినప్పటికీ కొందరు తమ ప్రేమను కొనసాగించి, చివరకు పెళ్లి పీటలు ఎక్కుతుంటారు. బీహార్లో ఓ మహిళ తనకంటే నాలుగేళ్లు చిన్న వయసున్న సోదరుడిని ప్రేమించింది. భర్త దూరమైన బాధలో ఉన్న ఆమెకు సోదరుడి ఓదార్పుతో బాగా దగ్గరైంది. అయితే చివరికి వీరి ప్రేమ వ్యవహారం గురించి గ్రామస్తులకు తెలియడంతో పెద్ద గొడవ జరిగింది. చివరికి ఏమైందో తెలుసుకుందాం..
బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియా పరిధి బనుచాపర్ ప్రాంతంలో ఓ వితంతువు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈమె భర్త ఏడాది క్రితం ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. భర్త గురించి ఆలోచిస్తూ బాధలో ఉన్న ఆమె ఇంటికి.. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి రోజూ వచ్చేవాడు. అతడి ఓదార్పుతో ఆమెకు బాధ దూరమై.. అతడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వారిద్దరి మధ్య నాలుగేళ్ల వయసు తేడా ఉన్నా.. అవేమీ పట్టించుకోలేదు. ఎవరికీ తెలీకుండా ప్రేమాయణం సాగించారు. ఎలాగైనా కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో వీరి ప్రేమ వ్యవహారం.. ఇరు కుటుంబాల వారికి తెలిసింది. వీరి పెళ్లికి ససేమిరా అన్నారు. చివరకు ఈ విషయం గ్రామపెద్దల వరకూ వెళ్లింది. ఇద్దరినీ పంచాయితీకి పిలిపించారు. ప్రేమికులకు గుండు కొట్టించాలని గ్రామ పెద్దలు తీర్చు ఇచ్చారు. అయితే ఇదే సమయంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు. గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ప్రేమికులకు రక్షణ కల్పించారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మాట్లాడారు. కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో సమస్య సర్దుమనిగింది. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి