వర్షం వస్తే ఇంతే..!

ABN , First Publish Date - 2021-11-20T05:43:38+05:30 IST

వర్షం పడితే చాలు వారపు సంత చిత్తడిగా మారుతోంది.

వర్షం వస్తే ఇంతే..!
బురదమయంగా మారిన సంత మార్కెట్‌

జూపాడుబంగ్లా, నవంబరు 19: వర్షం పడితే చాలు వారపు సంత చిత్తడిగా మారుతోంది. ప్రస్తుతం ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడి పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్థాలు కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. సంతకు వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-11-20T05:43:38+05:30 IST