ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్టు.. చివరకు నంబర్ తీసుకుని, అశ్లీల వీడియోలతో.. ఛీఛీ.. !

ABN , First Publish Date - 2021-10-18T00:52:03+05:30 IST

ఢిల్లీలో ఓ బాధితుడి ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి ఓ యువ‌తి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ‌చ్చింది. ఆ రిక్వెస్ట్‌ను అంగీక‌రించగానే హాయ్ అని మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి అతడితో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది.

ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్టు.. చివరకు నంబర్ తీసుకుని, అశ్లీల వీడియోలతో.. ఛీఛీ.. !

ఫేస్‌బుక్‌లో స్నేహితులు పెరిగే కొద్దీ లైకులు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో.. కొంతమంది ఎక్కడెక్కడి వారినో స్నేహితులుగా చేసుకుంటూ ఉంటారు. మరికొందరు అందమైన అమ్మాయి ఫొటో కనిపిస్తే చాలు.. ఫ్రెండ్ రిక్వెస్టు పెడుతూ ఉంటారు. వాళ్లతో పరిచయం పెంచుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు. వారి నుంచి ఒక్కసారి హాయ్ అని మెసేజ్ వచ్చిందంటే చాలు.. ఇక మైమరచిపోతారు. పనులన్నీ మానుకుని నిత్యం.. ఆ కనిపించని అమ్మాయితో చాటింగ్ చేస్తూ అదే లోకంలో విహరిస్తుంటారు. ఇలాగే ఢిల్లీలో ఓ యువకుడికి.. ఓ అజ్ఞాత ప్రియురాలు పరిచయమైంది. తర్వాత వారి పరిచయం ఎంతదాకా వెళ్లిందంటే..


ఫేస్‌బుక్‌లో కొంత మంది యువతుల ఫొటోలు చూస్తే.. హీరోయిన్లు కూడా పనికిరారు అనేలా ఉంటారు. అలాంటి వారి ఫేస్‌బుక్ అకౌంట్‌లో స్నేహితుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. నిజంగా ఆ ఫొటోలో ఉన్న యువతిని చూసిన వారు.. వారిలో ఒక్కరు కూడా ఉండరు. కానీ ఆమెతో చాటింగ్ చేస్తూ ఊహల్లో విహరిస్తుంటారు. ఇలాగే ఢిల్లీలో ఓ బాధితుడి ఫేస్‌బుక్‌ అకౌంట్‌కి ఓ యువ‌తి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ‌చ్చింది. ఆ రిక్వెస్ట్‌ను అంగీక‌రించగానే హాయ్ అని మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి అతడితో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. అతని వాట్సప్ నెంబ‌ర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు వెంటనే పంపించాడు.


కొన్ని రోజులు వారి మధ్య చాటింగ్ బాగానే కొనసాగింది. తర్వాత అసలు కథ మొదలైంది. ఓ రోజు సదరు యువతి నుంచి యువకుడి వాట్సప్‌కు అభ్యంత‌రక‌ర కంటెంట్‌తో ఉన్న వీడియో వచ్చింది. ఏంటని చూడగా.. అందులో దుస్తులు లేకుండా తనను తాను చూసుకుని షాక్ అయ్యాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోను అందరికీ పంపుతామని బెదిరించారు. ఇలా బాధితుడితో రూ.1,96,000 వరకు రాబట్టారు. ఇంకా పంపాలని బెదిరించగా.. బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు.. ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నంబర్ల నుంచి ఫోన్లు చేసినట్లుగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు అశ్లీల వీడియోల్లో యువకుల ముఖాన్ని మార్ఫింగ్ చేసి, తద్వారా బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది.

Updated Date - 2021-10-18T00:52:03+05:30 IST