వివాహానికి గిఫ్ట్‌‌తో రావాల్సిన మహిళ.. గన్‌తో ఎంట్రీ.. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా..

ABN , First Publish Date - 2022-02-17T21:41:50+05:30 IST

పెళ్లికి వచ్చే బంధువులంతా వారి వారి స్థాయిని బట్టి.. ఏదో ఒక గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తారు. వధూవరులకు కానుకలను అందించి.. ఆశీర్వదించి వెళ్లడం పరిపాటి. అయితే ఓ మహిళ మాత్రం వివాహ వేడుకకు గిఫ్ట్‌‌తో కాకుండా గన్‌తో వచ్చింది...

వివాహానికి గిఫ్ట్‌‌తో రావాల్సిన మహిళ.. గన్‌తో ఎంట్రీ.. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా..

వివాహమంటేనే బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో సందడి సందడిగా ఉంటుంది. ఓ వైపు పచ్చటి తోరణాలు.. మరోవైపు ఆత్మీయ పలకరింపులు, యువత సరదా స్టెప్పులు, ఇంకోవైపు మధురమైన వంటకాల ఘుమఘుమలు.. వెరసి కళ్యాణ వేదికకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. పెళ్లికి వచ్చే బంధువులంతా వారి వారి స్థాయిని బట్టి.. ఏదో ఒక గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తారు. వధూవరులకు కానుకలను అందించి.. ఆశీర్వదించి వెళ్లడం పరిపాటి. అయితే ఓ మహిళ మాత్రం వివాహ వేడుకకు గిఫ్ట్‌‌తో కాకుండా గన్‌తో వచ్చింది. లోపల ఆమె ఏం చేస్తుందో అని అంతా కంగారు పడ్డారు. చివరకు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కళ్యాణ మండపంలో ఓ వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపం మొత్తం బంధువులు, సన్నిహితులతో సందడి సందడిగా ఉంది. ఆహ్వానం అందుకున్న వారంతా గిఫ్ట్‌లు తదితరాలను పట్టుకుని మండపంలోకి అడుగుపెడుతున్నారు. వధూవురులకు తాము తెచ్చిన కానుకలను అందించి ఫొటోలు దిగుతూ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా వచ్చుంటే.. ఇంత చెప్పాల్సిన పని లేదు. గిఫ్ట్‌తో రావాల్సిన ఆమె.. గన్‌తో ఎంటర్ అవడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఎవరిని షూట్ చేస్తుందో అనుకుని హడలిపోయారు. లోపలికి వచ్చిన ఆమె తుపాకిని ఒక్కసారిగా గాలిలోకి చూపిస్తూ ఆనందంతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపింది.

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..


ఈమేంటీ మరీ విచిత్రంగా చేస్తుందే.. అనుకుంటూ అంతా అలాగే చూస్తూ ఉన్నారు. తర్వాత ఆ మహిళ భర్త కూడా ఎంటరై తాను కూడా గన్‌తో ఫైరింగ్ చేశాడు. కాసేపు ఇద్దరూ కలిసి ఫైరింగ్ చేయడం మొదలెట్టారు. పెళ్లిలోని కొందరు అతిథులు ఈ తంతును మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి, గన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఈ ఘటన సంచలనం సృష్టించింది.

అత్తగారింట్లో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు యత్నం.. వారంతా కలిసి చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది..





Updated Date - 2022-02-17T21:41:50+05:30 IST