నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..

ABN , First Publish Date - 2022-05-28T01:57:08+05:30 IST

దాంపత్య జీవితాన్ని కొంతమంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కొందరు మహిళలైతే.. భర్త, పిల్లలు అనే బంధాలను మరిచి క్షణిక సుఖం కోసం తప్పటడుగులు వేస్తుంటారు. అలాగే కొందరు భర్తలు..

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..

దాంపత్య జీవితాన్ని కొంతమంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కొందరు మహిళలైతే.. భర్త, పిల్లలు అనే బంధాలను మరిచి క్షణిక సుఖం కోసం తప్పటడుగులు వేస్తుంటారు. అలాగే కొందరు భర్తలు కూడా పరాయి మహిళలను ఆశించి.. చివరకు జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఢిల్లీలో ఓ మహిళ ఇలాగే చేసింది. నలభై ఏళ్ల వయసులో ఆమెకు భర్తపై విరక్తి పుట్టింది. రోజూ గొడవలు జరుగుతుండడంతో తనను వదిలించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో యువకుడు పరిచయమవడంతో చివరకు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..


ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో జీబా, మొయినుద్దీన్ ఖురేషీ(47) దంపతులు.. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో జీవనం సాగిస్తున్నారు. మొయినుద్దీన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయినప్పటి నుంచి మొన్నటిదాకా వీరి సంసారంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే కొన్ని నెలలుగా దంపతుల మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు కాస్త రోజు రోజుకూ పెద్దవయ్యాయి. దీంతో నలభై ఏళ్ల వయసున్న జీబాకు భర్తపై విరక్తి పుట్టింది. పిల్లలను చూసైనా సర్దుకుపోవాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. యువకుల పరిచయం కోసం రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసేది. ఈ క్రమంలో ఆమెకు యూపీకి చెందిన షోయబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ప్రవర్తన నచ్చడంతో రోజూ ఫోన్లలో మాట్లాడేది. అప్పుడప్పుడూ భర్తకు తెలీకుండా అతడిని రహస్యంగా కలిసి వచ్చేది. అయితే భర్త అడ్డు తొలగించుకుంటే.. ప్రియుడిని పెళ్లి చేసుకోవచ్చని భావించింది.

ఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని..


ఇదే విషయాన్ని షోయబ్‌కు చెప్పి.. ఎలాగైనా తన భర్తను చంపేయాలని బలవంతంగా ఒప్పించింది. దీంతో షోయబ్, తన స్నేహితుడు కలిసి పక్కా పథకం పన్నారు. మొయినుద్దీన్‌ను చంపేందుకు కొందరు దుండగులకు రూ.6లక్షల సుఫారీ ఇచ్చారు. అంతా కలిసి యూపీ నుంచి చోరీ చేసిన బైక్‌లో దర్యాగంజ్‌కు వచ్చారు. మే 17న వేకువజాము ఇంటి బయట మొయినుద్దీన్ మూత్ర విసర్జన చేస్తుండగా.. ఒక్కసారిగా అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో మొయినుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బైకు నంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మూడ్రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయని తల్లిదండ్రులు.. అనుమానంతో ముంబై నుంచి వచ్చి చూసిన కూతురు.. ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే..

Updated Date - 2022-05-28T01:57:08+05:30 IST