IT Stock : 9 ఏళ్లలో లక్షకు రూ.82 లక్షలు రిటర్న్ ఇచ్చిన ఈ ఐటీ స్టాక్ గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-07-23T20:05:29+05:30 IST

స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన, ఓపిక ఉండాలే కానీ పెద్దగా పెట్టుబడి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టవచ్చు.

IT Stock : 9 ఏళ్లలో లక్షకు రూ.82 లక్షలు రిటర్న్ ఇచ్చిన ఈ ఐటీ స్టాక్ గురించి మీకు తెలుసా?

IT Stock : స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన, ఓపిక ఉండాలే కానీ పెద్దగా పెట్టుబడి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టవచ్చు. టాటా ఎలెక్సీ(Tata Elxsi) షేర్ అలాంటి వాటిలో ఒకటి. చాలా ఐటీ(IT) స్టాక్‌లు భారీ నష్టాన్నిచవిచూస్తున్న సమయంలో కూడా.. ఈ టాటా గ్రూప్ ఐటీ స్టాక్(Tata Group IT stock) అదరగొట్టింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 42 శాతం రాబడిని అందించింది. ఈ షేర్ తన వాటాదారులకు భారీ రాబడిని ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. భారతదేశంలోని మల్టీబ్యాగర్ స్టాక్‌(Multibagger stock)లలో ఇది ఒకటి.


టాటా ఎలెక్సీ ఇది చాలా కాలంగా దాని వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తోంది. గత 9 సంవత్సరాలలో.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ షేర్‌కు రూ.102 నుంచి రూ. 8370ల వరకూ పెరిగింది. అంటే ఈ స్టాక్ కేవలం 9 ఏళ్లలో దాదాపు 8100 శాతం రాబడిని అందజేసింది. గత నెలలో ఈ లార్జ్ క్యాప్(Large Cap) స్టాక్ రూ.7788 నుంచి రూ.8370 పెరిగింది. ఇక గడిచిన 6 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ టాటా గ్రూప్ స్టాక్ రూ.7040 నుంచి రూ.8370కి పెరిగింది. 2022లో 42 శాతం పెరిగింది.


గడిచిన 9 ఏళ్లలో స్టాక్ ఎన్ఎస్ఈ(NSE)లో రూ.102 నుంచి రూ.8370కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 8100 శాతం పెరిగింది. టాటా ఎలెక్సీ ప్రైస్ హిస్టరీ(Price History)ని పరిశీలిస్తే.. ఒక నెల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ.1.075 లక్షలు అందించింది. 6 నెలల్లో రూ.1.19 లక్షలు అందించింది. ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకూ రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ.1.42 లక్షలు అందించింది. ఏడాది క్రితం పెట్టుబడి పెట్టిన వారికి రూ.1.95 లక్షలు అందించింది. ఇక తొమ్మిదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టి స్టాక్‌ను హోల్డ్ చేసిన వారికి రూ.82 లక్షలు అందించింది.


టాటా ఎలెక్సీ వర్సెస్ టీసీఎస్ వర్సెస్ విప్రో వర్సెస్ ఇన్ఫోసిస్..


ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకూ చూస్తే.. టాటా ఎలెక్సీ 42 శాతం రాబడిని అందించగా.. టీసీఎస్, విప్రో(Wipro), ఇన్ఫోసిస్(Infosys) వంటి ఐటీ మేజర్లు 2022లో సున్నా రాబడిని ఇచ్చాయి. 2022లో ఇన్ఫోసిస్ షేర్ ధర దాదాపు రూ.1900 నుంచి రూ.1500లకు దిగజారి దాదాపు 21 శాతం నష్టపోయింది. అదేవిధంగా.. విప్రో షేరు ధర దాదాపు రూ.718 నుంచి రూ.410కి దిగజారింది. ఈ సంవత్సరంలో దాదాపు 42 శాతం నష్టాన్ని నమోదు చేసింది. TCS షేర్లు సైతం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ తమ షేర్‌హోల్డర్స్‌కు దాదాపు 17 శాతం నష్టాన్ని అందజేశాయి.


Updated Date - 2022-07-23T20:05:29+05:30 IST