ఈ మెడిసిన్‌ ఉచితం!

ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST

నవ్వు అనేది ఓ దివ్య ఔషధం. ఈ సమాజానికి కావాల్సిందిదే. ముఖ్యంగా ఈ ప్యాండమిక్‌ పరిస్థితుల్లో

ఈ మెడిసిన్‌ ఉచితం!

నవ్వు అనేది ఓ దివ్య ఔషధం. ఈ సమాజానికి కావాల్సిందిదే. ముఖ్యంగా ఈ ప్యాండమిక్‌ పరిస్థితుల్లో చాలామందిలో నవ్వు కరువవుతోంది. ఆనందానికి నిజమైన మెడిసిన్‌ నవ్వే అని తెలిసి కూడా సీరియస్‌గా ఉంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదంటున్నారు పరిశోధకులు. శారీరకంగానే కాకుండా మానసికంగా గొప్ప రిలీఫ్‌ ఇచ్చేది నవ్వే. నవ్వు వల్ల భయం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నవ్వుతూ హ్యాపీగా ఉంటే శరీరం, మైండ్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. ముఖ్యంగా చక్కటి మూడ్‌ క్రియేట్‌ అవుతుంది. ఇంట్లోనో, స్నేహితుల దగ్గరో జోక్స్‌ వేసుకుని హాయిగా నవ్వటం వల్ల పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. 


కెరీర్‌లో టార్గెట్స్‌, కరోనా లాంటి పరిస్థితులు ఉన్నాయని సీరియస్‌గా ఉండటం వల్ల ఉపయోగం లేదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. మానసికోల్లాసం మంచిదే. దీంతో పాటు హ్యాపీగా నవ్వుకోవడానికి చిన్న పిల్లలనే స్ఫూర్తిగా తీసుకోవాలి. వీలైతే చిన్నపిల్లలైనా తప్పులేదంటున్నారు పరిశోధకులు. ఫన్‌గా ఉంటే ఖర్చేమీ కాదు. ఉచితమే. పైగా ఫన్‌ యాటిట్యూడ్‌ పది మందికి పంచితే అది ఇంకా స్ర్పెడ్‌ అవుతుంది. మొత్తానికి కరోనా పరిస్థితులతో భయాలకు లోనవుతున్న ఈ సమాజానికి సీరియస్‌ కంటే నవ్వు అవసరం ఎంతో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 


Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST