ఈ ఆక్టోపస్‌ విషం సైనేడ్‌ కన్నా విషపూరితం!

ABN , First Publish Date - 2021-02-10T06:30:41+05:30 IST

అత్యంత విషపూరితమైన సముద్రజంతువుల్లో ఇది ఒకటి. దీని విషం సైనేడ్‌ కన్నా పదివేల రెట్లు ఎక్కువ విషపూరితం. అది ఒక్క నిమిషంలో 27 మందిని చంపేంత విషాన్ని కలిగి ఉంటుంది...

ఈ ఆక్టోపస్‌ విషం సైనేడ్‌ కన్నా విషపూరితం!

అత్యంత విషపూరితమైన సముద్రజంతువుల్లో ఇది ఒకటి. దీని విషం సైనేడ్‌ కన్నా పదివేల రెట్లు ఎక్కువ విషపూరితం. అది ఒక్క నిమిషంలో 27 మందిని చంపేంత విషాన్ని కలిగి ఉంటుంది. హిందూ, పసిఫిక్‌ సముద్ర జలాల్లో కనిపించే బ్లూ రింగ్‌ ఆక్టోపస్‌ విశేషాలు ఇవి.


  1. ఈ ఆక్టోపస్‌ 12 నుంచి 20 సెంమీ. వరకు పొడవు పెరుగుతుంది. ఇది వేటాడే సమయంలో, ప్రమాదం ఎదురైన సమయంలో శరీరంపై బ్లూ రింగ్స్‌ కనిపిస్తాయి. 
  2. ఇది పీతలు, రొయ్యలను ఆహారంగా తీసుకుంటుంది. చిన్న చిన్న చేపలను తింటుంది. 
  3. ఈ ఆక్టోపస్‌ నుంచి వెలువడే విషం కదలికలకు ఉపయోగపడే కండరాలను స్తంభింప చేస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఈ విషాన్ని టెట్రోడొటాక్సిన్‌ అంటారు. ఇది తన ముక్కు ద్వారా విషాన్ని వదులుతుంది. దీని విషం బారినపడితే ఒక నిమిషం లోపలే ఆక్సిజన్‌ అందక గుండె ఆగి చనిపోతారు.
  4. దీనిలో మరో ప్రత్యేకత ఏమింటంటే ఇది కరిచినా నొప్పి తెలియదు. కండరాలు కదలకుండా కావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాల ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. 

Read more