ఈ వ్యక్తి దగ్గర సుమారు 3వేల సెల్‌ఫోన్లు.. ఇన్ని ఫోన్లు ఎందుకంటే.. అతడు చెప్పే సమాధానం ఇదీ..

ABN , First Publish Date - 2022-03-18T21:13:34+05:30 IST

మొబైల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరూ రెండు నుంచి మూడు ఫోన్ల వరకూ వాడుతున్నారు. కానీ ఓ

ఈ వ్యక్తి దగ్గర సుమారు 3వేల సెల్‌ఫోన్లు.. ఇన్ని ఫోన్లు ఎందుకంటే.. అతడు చెప్పే సమాధానం ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరూ రెండు నుంచి మూడు ఫోన్ల వరకూ వాడుతున్నారు. కానీ ఓ వ్యక్తి దగ్గర మాత్రం ఏకంగా వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫోన్లను కలెక్ట్ చేయడం వెనక ఉన్న తన ఉద్దేశాన్ని తాజాగా వెల్లడించాడు. రికార్డు స్థాయిలో ఫోన్లను పోగు చేయడం వెనక మంచి ఆలోచనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఆసక్తికరమైన అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


టర్కీకి చెందిన ఎక్రెమ్.. మొబైల్ ఫోన్లు రిపేర్ చేస్తూ వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతడి వద్దకు రిపేర్‌కు వచ్చిన రకరకాల మొబైల్స్‌ను చూసి ముచ్చట పడ్డాడు. 2010లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యేకమైన సెల్‌ఫోన్లను కలెక్ట్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతడికి మరో ఆలోచన వచ్చింది. తాను పోగు చేసిన వివిధ రకాల సెల్‌ఫోన్‌లతో ఓ మ్యూజియం ప్రారంభించాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఏకంగా 2,779 ఫోన్లను సేకరించి, తన షాప్‌లో భద్రపరిచాడు. దీంతో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యధిక సెల్‌ఫోన్‌లు ఉన్న వ్యక్తిగా అతడు గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ఈ సందర్భంగా ఎక్రెమ్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. తన వద్ద పరిమిత సంఖ్యలో బటన్స్ ఉన్న మొబైల్ ఫోన్స్‌తోపాటు 1980 కాలం నాటి ఫోన్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రతి ఫోన్‌కూ ఓ ప్రత్యేక ఉంటుందని అందుకోసమే తాను ఈ ఫోన్‌లతో మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు వివరించాడు. కస్టమర్లు తనకు ఫ్రీగా ఇచ్చిన కొన్ని మొబైల్స్ ఇందులో ఉన్నట్టు చెప్పాడు.

Updated Date - 2022-03-18T21:13:34+05:30 IST