ఈ చెట్టు వయస్సు 2 కోట్ల ఏళ్లు!

ABN , First Publish Date - 2021-01-29T07:18:57+05:30 IST

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఒక చెట్టు కాండం. అందులో విశేషమేముంది అంటారా? ఆ చెట్టు కాండం రెండు కోట్ల ఏళ్ల క్రితంది.

ఈ చెట్టు వయస్సు 2 కోట్ల ఏళ్లు!

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఒక చెట్టు కాండం. అందులో విశేషమేముంది అంటారా? ఆ చెట్టు కాండం రెండు కోట్ల ఏళ్ల క్రితంది. గ్రీస్‌ దేశంలో ఒక అడవి గుండా రోడ్డు వేయడం కోసం తవ్వుతున్నప్పుడు బయటపడింది. ఆ చెట్టు శిలాజాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు రెండు కోట్ల ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. 


ప్రస్తుతం అది ఏ రకమైన చెట్టు అనేది తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. ‘‘చెట్టును సురక్షితమైన ప్రదేశంలో భద్రపరిచాం. దాని కలపను అధ్యయనం చేయడం ద్వారా ఏ చెట్టు అనేది తెలుసుకుంటాం’’ అని మ్యూజియం ఆఫ్‌ న్యాచురల్‌ హిస్టర్‌ ప్రొఫెసర్‌ నికోస్‌ అన్నారు.


బయటపడ్డ శిలాజం 19 మీటర్ల పొడవుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద దానిపై మందపాటి లేయర్‌గా ఏర్పడింది. దానివల్ల చెట్టు నశించిపోకుండా ఉంది అని పరిశోధకులు తేల్చారు.

Updated Date - 2021-01-29T07:18:57+05:30 IST