
జలపాతం చూడాలంటే మనమే అక్కడకు వెళ్లాలి. కానీ ఇక్కడ జలపాతమే నగరంలోకి వస్తుంది. అలాంటి జలపాతం ఎక్కడుందీ అంటారా? చైనాలోని కున్మింగ్ నగరంలో ఉంది.
నగరజీవులు సేదతీరడం కోసం, ఉల్లాసపరచడం కోసం అధికారులు ఈ కృత్రిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆమితాసక్తి కనుబరుస్తున్నారట.
400 మీటర్ల వెడల్పులో, 40 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతం అందాలు కట్టిపడేస్తాయి. ఈ ప్రదేశం ప్రస్తుతం ఆటవిడుపు కేంద్రంగా మారింది.
ఈ జలపాతం కోసం దగ్గరలో ఉన్న న్యూలాన్ నదిలో నుంచి నీటిని మళ్లించి డియాంచి లేక్‌ను నింపుతున్నారు. ఇది స్వచ్ఛమైన నీటిని కలిగి ఉన్న అతిపెద్ద సరస్సు.
జలపాతం అందాలు దగ్గరి నుంచి చూడటం కోసం నది మధ్యలో నుంచి గ్లాస్ వంతెనను కూడా ఏర్పాటు చేశారు.