కరోనా అంటేనే అంతా భయపడిపోతోంటే.. ఈ కుర్రాడు కావాలని అంటించుకుంటున్నాడు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-05-03T11:51:56+05:30 IST

ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలు కరోనా అని చెప్తే చాలు ఆమడదూరం పరిగెడుతున్నారు. వెంటనే శానిటైజర్లతో డిసిన్ఫెక్ట్ చేసేసుకుంటున్నారు. ఎవరు తుమ్మినా,దగ్గినా సరే ముందు వారికి వైరస్ సోకిందనే అనుమానమే వస్తోంది.

కరోనా అంటేనే అంతా భయపడిపోతోంటే.. ఈ కుర్రాడు కావాలని అంటించుకుంటున్నాడు.. అసలు కథేంటంటే..

ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలు కరోనా అని చెప్తే చాలు ఆమడదూరం పరిగెడుతున్నారు. వెంటనే శానిటైజర్లతో డిసిన్ఫెక్ట్ చేసేసుకుంటున్నారు. ఎవరు తుమ్మినా,దగ్గినా సరే ముందు వారికి వైరస్ సోకిందనే అనుమానమే వస్తోంది. దీనికితోడు ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు కూడా సాధారణంగా లేవు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఓ 23 ఏళ్ల యువకుడు తనకుతానే కరోనా వైరస్ ఎక్కించుకోవడానికి వచ్చాడు. డర్హమ్ అనే ప్రాంతానికి చెందిన సదరు యువకుడు.. స్వయంగా వచ్చి ప్రమాదకరమైన కరోనా వైరస్ తనకు ఎక్కించాలని చెప్తున్నారు.


ఇలా కరోనా వైరస్‌ను స్వయంగా ఎక్కించుకుంటున్న ఈ యువకుడు డర్హమ్‌కు చెందిన జాకబ్ హాప్‌కిన్స్. అంతేకాదు, హాప్‌కిన్స్ ఏదో సరదా కోసం వైరస్ ఎక్కించుకోవడానికి రెడీ అవ్వలేదు. ఇదో హ్యూమన్ ట్రయల్ ఛాలెంజ్. దీనివల్ల కరోనా వైరస్ గురించి మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం శాస్త్రవేత్తలకు కలుగుతుంది. ఈ క్రమంలో ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం కోసం యూకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదిగో ఈ ప్రణాళికలో భాగంగానే వైరస్ ఎక్కించుకోవడానికి వాలంటీరుగా హాప్‌కిన్స్ వెళ్లాడు. ఒక చోట క్వారంటైన్ పెట్టిన పోలీసులు.. వైరస్ వ్యాప్తిని పరిశీలించడం కోసమే ఈ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.



‘‘నాకు 23 ఏళ్లు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నా. కరోనా వైరస్ కారణంగా నేను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తదు’’ అని హప్‌కిన్స్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇలా కరోనా ఎక్కించుకోవడం వల్ల మరణించే అవకాశం కూడా చాలా తక్కువని, 10వేల మందిలో ఒక్కరు మాత్రమే మరణించే, ఇది కిడ్నీ డొనేట్ చేసే శస్త్రచికిత్స కన్నా మూడు రెట్లు తక్కువ రిస్క్ అని హాప్‌కిన్స్ చెప్పాడు. అయితే ఇలా చేయడం వల్ల ఎటువంటి రిస్కూ లేకుండా ఉండదని చెప్పిన హాప్‌కిన్స్.. దాని గురించి పూర్తిగా తెలియని ప్రమాదకరమైన వైరస్‌ను ఇలా కావాలని మనుషులకు, అందునా యువకులకు ఇవ్వడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. 


తన నిర్ణయంలో ఉన్న రిస్కులన్నింటి గురించి తాను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నట్లు హాప్‌కిన్స్ స్పష్టంచేశాడు. ఈ వైరస్‌ ఎక్కించుకున్న తర్వాత హాప్‌కిన్స్‌ను 24 గంటల శాస్వవేత్తలు పరిశీలిస్తారు. ఈ మానవ ట్రయల్స్‌లో భాగంగా ఎంపిక చేసిన అతి కొద్ది మంది వాలంటీర్లకు కరోనా వైరస్ ఎక్కిస్తారు. ఆపై వారిని జాగ్రత్తగా పరిశీలించడం వల్ల వైరస్ ఎలా వ్యాపిస్తుంది? దీనిపై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వంటి ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది. ఎంత రిస్క్ ఉన్నా, ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రాణాలను కాపాడటంలో, వారికి త్వరగా వ్యాక్సిన్ అందజేయడంలో ఇలా సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, తన నిర్ణయంపై తను ఎటువంటి అసంతృప్తి లేదని హాప్‌కిన్స్ స్పష్టంచేశాడు.



హ్యూమన్ ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 90 మంది వాలంటీర్లకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తారు. వివిధ డోసుల్లో వైరస్ ఎక్కింంచి, వారందరినీ జాగ్రత్తగా పరిశీలిస్తారు. కరోనా ఇన్‌ఫెక్షన్ రావడానికి ఎంత తక్కువ వైరస్ సరిపోతుంది? అనే అంశాన్ని కూడా ఈ ట్రయల్‌లో పరిశీలిస్తారు. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ కలిసి ఈ ట్రయల్‌ నిర్వహిస్తున్నాయి. అన్ని క్లినికల్ ట్రయల్స్‌లానే ఈ పరిశోధనను కూడా మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ), ఎన్‌హెచ్ఎస్ హెల్త్ రీసెర్చ్ అథారిటీ సంస్థలు ఈ ట్రయల్‌ నిర్వహించడం కరెక్టేనా? కాదా? అని పరిశీలిస్తాయి. ఈ సంస్థల నిర్ణయం వచ్చే వరకూ ట్రయల్స్ మొదలుకావని సమాచారం. ఏది ఏమైనా మానవకోటి కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ యువకులను మెచ్చుకోక తప్పదు.

Updated Date - 2021-05-03T11:51:56+05:30 IST