వంటలు

తొక్కుడు ఊరగాయ

తొక్కుడు ఊరగాయ

కావలసినవి: మామిడికాయలు పుల్లనివి - నాలుగు, ఉప్పు - పావుకప్పు, కారం - అరకప్పు, పసుపు - పావు టీస్పూన్‌, మెంతిపొడి - రెండు టీస్పూన్లు, ఆవపొడి - రెండు టీస్పూన్లు, నూనె - ఒకటిన్నర కప్పు, ఎండుమిర్చి - రెండు, ఇంగువ - అర టీస్పూన్‌.


తయారీ విధానం: మామిడికాయలను ముక్కలుగా తరిగి ఎండలో పెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తరువాత కొద్ది కొద్దిగా ముక్కలు, ఉప్పు గ్రైండ్‌ చేసుకుంటూ(మరీ మెత్తగా కాకుండా ముక్కలు కాస్తనలిగేలా) ముద్దలా చేసుకోవాలి. తరువాత మెంతిపొడి, ఆవపొడి, పసుపు కలుపుకోవాలి.ఆ ముద్దపై కారం పోసి ఉంచుకోవాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఇంగువ వేయాలి. ఈ పోపుని మామిడికాయ మిశ్రమంలో కలుపుకొంటే కమ్మటి తొక్కుడు పచ్చడి రెడీ.


Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.