జయహో సాత్విక్‌

ABN , First Publish Date - 2022-05-16T06:28:37+05:30 IST

బ్యాంకాక్‌లో జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్‌ పోటీల్లో అమలాపురం పట్టణానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడా కారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ ప్రాతినిథ్యం వహించిన జట్టు విజయం సాధించడంతో ఆదివారం పట్టణంలో సం బరాలు జరుపుకున్నారు.

జయహో సాత్విక్‌
గడియార స్తంభం సెంటర్‌లో సంబరాలు

థామస్‌ కప్‌ విజయంతో అమలాపురంలో సంబరాలు
అమలాపురం, మే 15(ఆంధ్రజ్యోతి):  బ్యాంకాక్‌లో జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్‌ పోటీల్లో అమలాపురం పట్టణానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడా కారుడు రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ ప్రాతినిథ్యం వహించిన జట్టు విజయం సాధించడంతో ఆదివారం పట్టణంలో సం బరాలు జరుపుకున్నారు. నలభై మూడేళ్ల అనంతరం థామస్‌కప్‌ పోటీల్లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో పాటు బంగారు పతకం సాధించడంతో క్రీడాకారులు, క్రీడాభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ పోటీల్లో రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి జంట అద్భుత ప్రతిభచాటి భారత్‌కు ఘన విజయాన్ని అందించింది.
థామస్‌కప్‌లో విజయం సాధించడంతో కోనసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జాతీయ  పతాకాలను చేతబూని ఆఫీసర్స్‌ క్లబ్‌ నుంచి జయహో సాత్విక్‌ అంటూ నినాదాలు చేసుకుంటూ గడియార స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ మెట్ల రమణబాబు, కోనసీమ జేఏసీ చైర్మన్‌ వాసా ఎస్‌.దివాకర్‌, కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. జేఏసీ ప్రతినిధులు కరాటం ప్రవీణ్‌, అల్లాడ శరత్‌బాబు, అన్యం రాంబాబు, డాక్టర్‌ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, జంగా రాజేంద్రకుమార్‌, పోతుల సుభాష్‌చంద్రబోస్‌, దాసం గోపి, కల్వకొలను బాబు, జయంతి సురేష్‌, ఎస్‌.సంసోను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T06:28:37+05:30 IST